Tuesday, March 8, 2011

ప్రవళిక

ఉదయం 9 గంటలు. భానుడి వెలుగుకి నిదుర కళ్ళతో లేచి సమయం చూసుకుంది ప్రవళిక.  
" అయ్య బాబోయ్...!!!! బారెడు పొద్దు ఎక్కింది. ఇంకా ఎమన్నా ఉందా..!! ఆఫీసుకి లేట్ గా వెళ్తే మేనేజర్ తోలు తీస్తాడు"

అనుకుందే తడవుగా హడావిడి గా లేచి వాశ్రూం లోకి పరుగు లంగించుకుంది. బ్రష్ నోట్లో పెట్టుకొని అద్దం లోకి చూస్తూ రాత్రి జరిగిన గొడవ గురించి ఆలోచిస్తుంది. కట్ చేస్తే,
" నాన్న..! అతని పేరు పార్థు. నాతో పటు పనిచేస్తారు. మేము ఇద్దరం జాబులో జాయిన్ అయిన దెగ్గర నుంచి తెలుసు. బాగా  పరిచయం అది కాస్త ప్రేమ గా మారింది. పెళ్ళంటూ చేసుకుంటే పార్థునే చేసుకుంటా." అని కరాకండిగా చెప్పింది వాళ్ళ నాన్న రంగారావు గారికి మళ్ళి...
"అమ్మాయ్..!! నేను నీకు చాలా సార్లు చెప్పాను. నాకు అతను అంటే ఇష్టం లేదు." - రంగారావు.
"నన్ను బాగా చూసుకుంటాడు  నాన్న..! మిమ్మల్ని చాలా గౌరవిస్తాడు. " - ప్రవళిక
"ఒకసారి చెపితే అర్ధం కాదా.? ఈ టాపిక్ మన ఇంట్లో నడవబట్టి నెల అవుతుంది. ఎలా చెబితే నీ బుర్ర కి ఎక్కుతుంది..? ఎందుకు మీరు పెద్దోళ్ళ మాట వినరు. ప్రేమ కి ఇద్దరు సరిపోతారు ఏమో..!! బట్ పెళ్లి కి రెండు కుటుంభాలు కావాలి" - రంగారావు గారు.
"అసలు నీ మొఖం చూసుకున్నవా.? ఎలా ఉందో చూడు నిదుర లేక..నీకు నిదుర లేదు, మాకు నిదుర లేదు.. ఎందుకు ఇంత మొండి గా చేస్తున్నావ్..? నిన్న నీ రూం లో చెక్ చేస్తే అమ్మకి స్లీపింగ్ పిల్ల్స్ దొరియాయి అంట. అసలు ఏమి అయిపోతున్నావురా నువ్వు? మా మంచి అమ్మ కదా..!! మాట విను అమ్మ..! ప్లీజ్.. వొద్దు. ఆ పిలగాడి వాళ్ళ ఫ్యామిలీ మంచిది కాదు అంట. " - రంగారావు గారు.
" నాన్న.!! మీరు నా మాట వినరే.. మీరే మొండి గా చేస్తున్నారు.. మా ప్రేమ అర్ధం చేసుకోవటం లేదు.  మన ఇంట్లో ఈ విషయం తెలిసినప్పటి నుంచి మీరు సరిగా మాట్లాడటం లేదు నాతో.  అన్ని అమ్మే చుస్కుంటుంది. నేను అంత పరాయి అయిపోయాన? చెప్పండి నాన్న.?" - ప్రవళిక
"ఆఫీసు వర్క్ టెన్షన్ తో నేను చాలా సతమతమవుతున్న  ఆపైన ఇంటికి రాంగానే ఈ నస.. చచ్చిపోవాలని  అనిపిస్తుంది. " - ప్రవళిక

"ఒకటి మాత్రం నిజం నాన్న..! పార్ధుకి  నేను అంటే ప్రాణం.. అయిన పెళ్లి అయాక ఇద్దరం కలిసి వేరే ఉంటాం. మేము ఢిల్లీ లో సెటిల్ అవుదామని అనుకుంటున్నాం." - ప్రవళిక

"మీరు ఇలా ఎన్ని రోజులు నాతో arguement చేసిన ప్రయోజనం ఉండదు. అల కాదు అని బలవంత పెడితే నా శవాన్ని చూస్తారు. " - ప్రవళిక
" నీకు ఎందుకు అమ్మ అంత కష్టం .? నువ్వే మంచిగా ఉండు మేమే ఇంత విషం తాగి చస్తాం. నిన్ను కన్న పాపానికి మేమే పోతాం. మీరు రండి భోజనం చేద్దురు గాని " కళ్ళ తుడుచుకుంటూ వంటగదికి వెళ్లిపోయింది రంగారావు గారి భార్య వాణి. 
" నాకు ఏమి వొద్దు వాణి.! చాలు... నా కూతురు నాకు కడుపు నింపింది" - రంగారావు గారు.
వాణి కూడా రంగారావు గారిని అనుసరించింది. ఇంగ అక్కడ ఒక్కతే మిగిలిపోయింది ప్రవళిక.  అలా... వేదన తో నిండుకున్న మనసుతో.. నీళ్ళతో నిండుకున్న కళ్ళతో... బెడ్రూం కి తను కూడా ఏమి తినకుండా పరుగు తీసింది.
           ఆఫీసు లంచ్ టైం లో కూడా, పార్ధు ఎంత ఫొర్స్ చేసిన తినలేదు తను.
 అద్దంలో తన్ని తాను చూస్తు మళ్ళి అనుకున్నది. " అప్పట్లో ఎంత అందం గా ఉండేదాన్ని . ముఘ్ద  మనోహర రూపం అనేవారు ఇంట్లో వాళ్ళు అంతా.. అందుకే అంత వెంట పడ్డాడు పార్ధు. బాపు బొమ్మరా ..! నువ్వు అనేవాడు. నేను వొద్దు అని ఎంత వారించిన వినలేదు. అంత అందమయిన  అమ్మాయ్... ఏంటి ఇలా అయిపోయింది. డార్క్ CIRCLES , మొటిమలు, పాలిపోయిన మొఖం, తనేన ప్రవళిక..?  
పేరెంట్స్నా ? లేక పార్ధునా? ఎవరు ముఖ్యం నాకు...? ఎందుకు నా మాట వినటం లేదు ? నేను ఎప్పుడు ఏది అడిగిన తీసుకు వచ్చే నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారు? అడగకముందే అని తెచ్చే నాన్ననేన?  ఇలా మాట్లాడేది... ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? నేను ఎం తప్పు చేశాను? ప్రేమించటం తప్పా..? ఇది మిలియన్ డాలర్ ప్రశ్న..WHY THIS IS HAPPENING TO ME? దేవుడా ప్లీజ్ కరుణించు...!"
బెడ్ మీద పడుకొని నిదుర రావటానికి, ఈ టెన్షన్ నుంచి నిదుర పోవటానికి స్లీపింగ్ పిల్ల్స్ తీసుకుంది. ఎంతో ఒత్తిడి, సరి అయిన తిండి లేదు, ఏమి లేదు. 
            అలా నెల నుంచి తను,తనలా..లేదు. ఆలోచిస్తూ పడుకుండి పోయింది. 
వాశ్రూం నుంచి బయటకి వచ్చి ఎదావిధిగా "మమ్మీ.." అంటూ పిలిచింది ప్రవళిక. ఎటువంటి స్పందన లేదు అమ్మ దగ్గరి నుంచి.
"నాన్న..!!" మళ్ళి పిలుపు.. లేదు ఛాన్స్ నే లేదు.
రోజు రాత్రి  ఎంత గొడవ అవుతున్నా... నాన్న..అమ్మతో మళ్ళి పొద్దున breakfast చేసే వెళ్తుంది ఆఫీసుకి తను. 
సరిగా తినటం లేదు. నిన్న రోజంతా ఏమి తినలేదు, ఆఖలిగా ఉండటంతో టిఫిన్ చేద్దాము అని ఎంత పిలిచినా ఎవరు రావటం పలకటం లేదు. 
ఇంతలో రంగారావు గారు హాల్ లోకి వచ్చారు.
" వాణి..!! కాఫీ తీసుకురా. అని చెప్పి ఈనాడు తిరగేస్తున్నారు.
హాల్ లోకి అప్పుడే వచ్చిన రంగారావు గారిని నాన్న..! నాన్న అని పిలుస్తుంది. రంగారావు గారు అసలు పలకటం లేదు. 
" రాత్రి జరిగిన దానికి నాన్న.. నాతో పూర్తిగా మాట్లాడటం ఆపేసారా ఏంటి.  అయ్యే ఉంటుంది... రాత్రి మొదటి సారిగా నాన్న కళ్ళలో నీళ్ళు చూసాను. అమాంతం నాన్నని పట్టుకొని ఏడవాలి అని ఉంది కాని, నాన్న కనీసం విన్నా.. విననట్టే ఉంటున్నారు. అంత శత్రువుని అయిపోయాను.
" ఈ లవ్ చేసిన వాళ్లకి ఏంటి ఈ పరీక్ష? "
సరే..!! అమ్మని పిలుద్దాం అని పిలించింది.. హాల్ గుండా వంట గది కి వెళ్తున్న ఆమె కూడా నో రిప్లై. 
" వాణి.. అమ్మాయిని పిలువు ఎన్ని సార్లు చెప్పాలి నీకు? వెళ్ళు నీ వంట ఎప్పుడు ఉండేదే గాని పో వెళ్ళు... రాత్రి అది కూడా ఏమి తినలేదు..." - రంగారావు గారు.

" అబ్బ పిలుస్తాను ఉండండి మీరును. " - వాణి 
అది కాదు వాణీ... ఒకసారి ఇలా రా..!! రాత్రి నిదుర పట్టక నేను బాగా ఆలోచించాను... తనే కరెక్ట్ నేమో..!! ఒప్పుకున్ధామా.. మరి? నువ్వు ఏమంటావ్? " - రంగారావు గారు. 

" అమ్మ.. నాన్న..!! ఏంటి మీరు పిలుస్తుంటే పలకరు..? ఇంగ చాలు ఆపండి ప్లీజ్.. మాట్లాడండి నాతో.." - ప్రవళిక

" ఏమో అండి..!! అది అంత పట్టుదలగా ఉంది కదా...నేనూ మాట్లాడను ఆ అభ్భాయ్ తో... పిలగాడు మంచివాడే... ఇంగా వాళ్ళ ఫ్యామిలీ అంటారా...! తను ఎలాగా ఢిల్లీ లో సెటిల్ అవుతాం.. అంటుంది కదా..సో ఒప్పుకోండి.. మరి మీరు.." - వాణి

" సరే వెళ్లి పిలువు తనని.." - రంగారావు గారు.

" సరే వంట గదిలో పాలు దించి తన బెడ్రూం కి వెళ్తాను.." - వాణి

ఇంగ లాభం లేదు ఏదో ఒకటి తెల్చేద్దాం.. అని తన బెడ్రూం నుంచి బయటకి వచ్చింది. హాల్ లో ఉన్న తన తండ్రి దెగ్గరికి వచ్చి "డాడి.. ప్లీజ్ " అని గట్టిగ అరిచింది ఈ సారి కూడా ... నో రిప్లై...

"చాలు నాన్న...!! ఇంగ చాలు ఆపండి.. ప్లీజ్.. " - మోకాళ్ళ మీద ఆయన ముందు వాలిపోయి పిలిచింది  ఈ సారి... అస్సలు ఉలుకు పలుకు లేదు రంగారావు గారి దగ్గర , అసలు తను ఆయన ఎదురుగ లేనట్టే బెహేవ్ చేస్తున్నారు.
"అబ్బా...!!!!!!!!! సరే మీరు చెప్పినట్టే వింటాను నాన్న..!  ప్లీజ్.. నాతో మాట్లాడండి నాన్న..!!" దుఖ్ఖం తన్నుకొని వచ్చి ఏడుస్తూనే ఉంది. 

ఇంతలో ఏమండి...!! అని ఒక పెద్ద కేక వాణి దగ్గరి నుంచి... రంగారావు, చదువుతున్న పేపర్ అక్కడనే పడేసి అరుపు వినిపించిన వైపుకి పరుగెత్తారు.. 

"అయ్యో....!!! "అని ఆయన ఏడవటం స్టార్ట్ చేసారు..హాల్ లో కూర్చొని ఏడుస్తున్న ప్రవళికకి ఏమి అర్ధం కావటం లేదు.. ఏంటా అని తనూ, కంగారు గా పరుగు తీసింది అటు వైపు... అది తన బెడ్రూం నే..!!
అటు వైపు నుంచే.. ఆ రోదనలు..

బెడ్రూం దెగ్గరికి వెళ్లి, లోపల చుసిన తనకి పెద్ద షాక్ .. తన కళ్ళను తానె నమ్మలేకపోయింది.. 
 తన ఎదురుగా....
" బెడ్ మీద ప్రవళిక స్పృహ లేకుండా పడి ఉంది..."

 - ఫ్రెండ్స్..!! ఇక్కడ ప్రవళిక అండ్ రంగారావు గారు ఇద్దరు, చివరికి ఒకరికోసం ఒకరు ఒప్పుకునే పరిస్థితి వచ్చింది కాని అప్పటికే  జరగవలసిన అనర్ధం జరిగిపోయింది.  తప్పు ఎవరిది అంటారు?