Tuesday, May 31, 2011

గుండెలోని ప్రేమ గీతాలు..........





                 హలో ఫ్రెండ్స్..!!! మీరందరు ఆణిముత్యాలు లాంటి పాటలు చాల వినే ఉంటారు,  ప్రముఖ స్వరకర్తలు అండ్ ప్రముఖ గేయరచయితలు రాసినవి. కాని మనకి తెలియని చాలా మంది మంచి రచయితలు కూడా ఉన్నారు, ఎంతో అధ్బుతంగా రాస్తారు.. అలాంటి ఒక రచయిత పాటని మీ ముందు ఉంచుదామని నా యొక్క ఈ చిన్న ప్రయత్నం.. ఈ పాట INSTANT CICK ఇస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే పాట "రావే.. నా చెలియా (2001)" చిత్రం లోనిది... వరికుప్పల యాదగిరి స్వర రచన లో శశి ప్రీతం యొక్క సంగీత సారధ్యం లో వచ్చింది... ఈ పాటలో పదాలు చాలా సాదా సీదా గా ఉంటాయ్.. కాని సంగీతం పాటకి చాలా అందం తెచ్చింది .... శశి ప్రీతం స్వర పరచటం మాత్రమె కాదండోయ్...  తన గాత్రం తో పాటకి ప్రాణం పోశారు... స్మిత హమ్మింగ్ ఈ పాటకి  అదనపు హంగు.   ఇది ఏంటి..? అంతా.. పాట గురించేనా ..?  మరి  సినిమా దర్శకుడు, నిర్మాత లాంటి వివరాలు,ఇంకా కథానాయకుడు, నాయకి వివరాలు ఏమి లేవా ? అని అనుకుంటున్నారా.. ఆగండి ఆగండి... వస్తున్న అక్కడికే వస్తున్న...  కిషోర్ కుమార్ అనే నూతన దర్శకుడి దిశా నిర్దేశం లో అమ్రేష్ కుమార్, సందీప్ జైన్ నిర్మాతల ద్వయం నిర్మించారు...  సాయి కిరణ్ హీరో... రింకు ఘోష్ అనే మోడల్ హీరోయిన్ లెండి. పెద్దగా లైం లైట్ లోకి రాలేదులెండి తను..

                 మనం ఇప్పుడు స్వర కర్త గురించి మాట్లాడుకుందాం.. శశి ప్రీతం...  క్రొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి అని నా అభిప్రాయం. ఏమంటారు?.... "ఈ వేళలో నీవు ఎం చేస్తూ ఉంటావో..." అని మన అందరికి చాలా దగ్గరైన సంగీత  దర్శకుడు... అయన సారద్యం వహించిన పాటల్లో ఇది ఒకటి, అండ్ చాలా CICK ఇచ్చే పాట అని నా అభిప్రాయం.... నాకు తెలిసి చాలా మంది శ్రోతలు, ఈ పాట పెద్దగా విని ఉండరు... వరికుప్పల యాదగిరి కూడా సంపంగి అనే సినిమాతో పరిచయం అయ్యారు.. ఇక నా సొల్లు ఇక్కడితో ఆపేస్తాను . మీరు ఎక్కువ ఆలస్యం చేయకుండా పాట ఏంటో తెలియాలి అంటే..  ఇదిగో క్రింద  ఉంది చుసేయండి. వినాలి అనుకున్న వాళ్ళు  ఈ లింక్ ద్వారా   వినేయండి, ఒక పని అయిపోతుంది... 
మరి ఉంటాను ఇక. ఇంకొక స్వరం తో మళ్ళీ కలుస్తాను దోస్తో... అప్పటిదాక బాయ్ బాయ్....... :)  

సూచన: పాట  వినాలంటే లేటెస్ట్  ఫ్లాష్ ప్లేయర్ ఉండాలండోయ్.... అది మర్చిపోకండి.. ప్లీజ్..
పాట:
గుండెలోని ప్రేమగీతాలు... ఈ రోజే విన్నానని....
మేలుకోని సుప్రభాతాలు నా చెలిమి చేరాలని ....
గాలిలో..... తేలుతూ...... హాయిగా.... పాడుతూ ....
కళ్ళలోని .. ప్రేమకావ్యాలు.. ఈ రోజే చదివానని ...
సాగిపోని తేనె భావాలు  నా చెలియ చూడాలని.......

ఇన్నాళ్ళు.. కలనే చేరని.. కన్నుల్లో తొలి స్వప్నాన్ని ..
నిలిపింది నీ రూపమే ... నీ నవ్వులో దీపమే 
నూరేళ్ళ నా దారిని .. ఆ కాంతి లో సాగనీ......

గుండెలోని ప్రేమగీతాలు... ఈ రోజే విన్నానని....
కళ్ళలోని .. ప్రేమకావ్యాలు.. ఈ రోజే చదివానని ... ||1 ||


చిత్రంగా ఉందీ... భావన... నేనేనా ? ఇంకేవరోనా?....
అనిపించి అణువణువునా..  సరిక్రొత్త  ఆలాపనా.....
ఈ ప్రేమ సంకీర్తనా....  నీకంకితం చేయనా.......

గుండెలోని ప్రేమగీతాలు... ఈ రోజే విన్నానని....
మేలుకోని సుప్రభాతాలు  నా చెలిమి చేరాలని ....
గాలిలో..... తేలుతూ...... హాయిగా.... పాడుతూ ....
కళ్ళలోని .. ప్రేమకావ్యాలు.. ఈ రోజే చదివానని ...
సాగిపోని తేనె భావాలు  నా చెలియ చూడాలని......


ఇట్లు 
Anudeep.......

Saturday, May 7, 2011

జెస్సి (Opera #2)

హే సమంతా,
            ఏంటి బయపడ్డావ? అనుకొన్నాను నేను.. నువ్వు బయపడి ఉంటావ్ అని..ఎందుకు బయం చెప్పు ? చూడబోతే నా గురించి బాగా ఆలోచిస్తున్నావ్  అనుకుంట..!! లంచ్ చేస్తూ, కాఫీ తాగుతూ..నాకు అంత తెలుసు.నీ పక్కన లేనప్పుడు కుడానేను నిన్ను ఫీల్ అవ్వగలను.. నా పక్కనే ఉన్నట్టు, కూర్చొన్నట్టు. ఎందుకంటే నేను అంత ఇదిగా నిన్ను లవ్ చేస్తున్నాను కాబట్టి..... ANYWAY నువ్వు నన్ను లవ్ చేయటం స్టార్ట్ చేసినప్పుడు నీకు అవగతం అవుతుంది...

-- సమీర్

లాస్ట్ టైం సమీర్ మెయిల్ చూసి పరిగెత్తిన సమంతా, మెయిల్ బాక్స్ లో "డాన్`T BE SCARED  "అని, పైన మెయిల్ కనిపించింది ఆఫీసు కి రాగానే..
మెయిల్ చుసిన సమంతా ఆలోచించటం మొదలు పెట్టింది.. అసలు ఎవరు ఇతను ? నిజంగ నన్ను లవ్ చేస్తున్నాడా? అంత గొప్ప ప్రేమికుడా? 
ఆ రోజు నుంచి తను అతనికి మెయిల్స్ కి రిప్లై ఇవ్వటం స్టార్ట్ చేసింది... అలా రోజు మాటలు, ముచ్చట్లు పెరిగాయ్.. అంతా మెయిల్ communication లెండి.  ఒకరోజు అతని నుంచి మెయిల్ కొంచం తేడ సంభోధనతో...

హాయ్ సమంతా డార్లింగ్...
                       ప్రిపరేషన్ ఎలా ఉంది? సర్టిఫికేషన్ కోసం టెస్ట్ రాస్తున్నట్టున్నావ్ రేపు.!అల్ ది బెస్ట్ బాగా రాయి...
- సమీర్
మెయిల్ చుసిన సమంతా షాక్ కి గురైంది. తను ఎవరికీ రివీల్ చేయలేదు ఆ ఎక్జాం డిటైల్స్...

సమీర్,
        ముందు ఈ విషయం చెప్పు..? ఎవరు నా డిటైల్స్ అన్ని నీకు ఇష్తున్నారు? నేను ఎవరికీ షేర్ చేయని విషయాలు కూడా నీకు తెలుస్తున్నాయ్... WHO ARE YOU ?
- సమంతా 

కరెక్ట్ గ 2 నిమిషాల్లో సమీర్ నుంచి రిప్లై...

అయ్యో.. సమంతా...
                       నాకు అన్ని విషయాలు తెలుస్తాయ్... నేను నీ ఎదురుగానే ఉన్నా..! నువ్వు  నన్ను కనిపెట్టలేకపోతున్నావ్... నన్ను ఇంకా లవ్ చేయటం లేదు. అందుకే,  నేను నీ దేగ్గరనే ఉన్నట్టు ఫీల్ అవ్వటం లేదు... ఇంకొక ౩ డేస్ లో మీకు అప్రయ్సాల్ అండ్ నీకు బెస్ట్ టీం ప్లేయర్ అవార్డు రాబోతుంది...అది నీకు అండ్ నీ మేనేజర్ కి  మాత్రమే తెలుసు.. అంటే నీ విషయాలను అన్ని సుజీత్ చెప్పాడు అనా?
- సమీర్ 

మెయిల్ చదివిన సమంతా " ఏంటి వీడికి నా మేనేజర్ పేరు కూడా తెలుసా? అంటే వీడికి సుజీత్ తెలుసు అనమాట..సుజీత్ నీ అడిగితే వీడు ఎవడో తెలిసిపోతుంది... సరే రేపు కలుద్దాం సుజీత్ ని. చాల లేట్ అయినది ఇప్పటికే.. "

నెక్స్ట్ డే, 
సమంతా:- హాయ్ సుజీత్.! నేను మీతో కొంచం మాట్లాడాలి..
సుజీత్:- యా... ఏమైనా ప్రాబ్లం నా?
సమంతా:- ప్రాబ్లం ఏమి లేదు.. సమీర్ గురించి మాట్లాడాలి...
షాక్ తో కూడిన ఫేస్ తో సుజీత్:-  " నీ..నీ... నీకు సమీర్ పేరు ఎలా తెలుసు? ఎవరు అయిన చెప్పారా?"
సమంతా:- నాకు ఎవరు ఏమి చెప్పలేదు... అతని నుంచి మెయిల్స్ వస్తున్నాయ్.. నా గురించి అంత చెబుతున్నాడు..నీ పేరు కూడా తెలుసు.. సో అందుకే నిన్ను అడుగుతున్నాను...
సుజీత్:- ARE YOU SURE ? సమీర్ నుంచే మెయిల్స్ వస్తున్నాయ?
సమంతా:- YES 
సుజీత్:- అవునా? అల కాకూడదే.. ఎందుకంటే సమీర్ చనిపోయి 2 years 
సమంతాకి  కింద నేల కంపించినట్టు అనిపించింది..
సుజీత్:-నీకు ఎవరో సమీర్ గురించి చెప్పి ఉంటారు.. వర్క్ stress లో పడి నీకు అలా అనిపిస్తుంది.. వెళ్లి కొంచం రెస్ట్ తీసుకో అంతా సెట్ అవుతుంది...
మైండ్ బ్లాక్ ఆయన సమంతా షాక్ నుంచి తేరుకొని:- లేదు సుజీత్.. నేను చెప్పేది నిజం.. నాతో రా..! నా మెయిల్ బాక్స్ లో చూపిస్తాను అతని మెయిల్స్.. 
మెయిల్ బాక్స్ చెక్ చేసిన సుజీత్ కంగారు పడ్డాడు.. ఎన్ని సార్లు సెర్చ్ చేసినా,  సమీర్ పేరు మీదనే మెయిల్స్ ఉన్నాయ్...ఆ తర్వాత కొంచం తేరుకొని:-  " ఐ థింక్.. సమీర్ మెయిల్ id డిలీట్ చేయలేదేమో.. అతని మెయిల్ IDని  ఎవరో నిన్ను ఏడిపించటానికి వాడుతున్నారు అనుకుంటా.. CCD కి కంప్లైంట్ చేయి... they will find out who is that culprit "

సమంతా, CCD పీపుల్ కి కంప్లైంట్ చేసింది.. వాళ్ళు వచ్చి సిస్టం చెక్ చేసారు... ఆ మెయిల్స్ సమీర్ నుంచే వచ్చినవే అండ్ same సిస్టం.. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఆ మెయిల్స్ అన్నిసమంతా సిస్టం లోనుంచే వచ్చినవే.! తన సిస్టం నుంచి తనకే మెయిల్స్ వస్తున్నాయ్ సమీర్ పేరు మీద....సిస్టం send  అండ్ recieve టైం మరియు సిస్టం login అన్ని perfect గా ఉన్నాయ్... even CCD వాళ్ళు కూడా షాక్ అయ్యారు.. same సిస్టం లోనే నాన్-existing id నుంచి మెయిల్స్ ఎలా అదే సిస్టం లోకి వచ్చాయని...!! ANTIVIRUS కూడా updated దే..మరి ఎలా జరుగుతుంది ఇది అంతా.. CCD వాళ్ళు కూడా కనిపెట్టలేకపోయారు...
ఈ తతంగం అంతా చూసిన సమంతా.. బాగా అలసిపోయి.. తొందరగా వెళ్లి పోయింది...
నెక్స్ట్ రెండు రోజుల దాక మెయిల్స్ ఏమి రాలేదు సమీర్ నుంచి...మూడో రోజు వర్క్ ఫినిష్ అయేసరికి బాగా లేట్ అయింది.. 10PM టైం చూసుకుంటే.. సరే తన బయలుదేరటానికి రెడీ అవుతుంటే.. one ALERT .. సమీర్ నుంచి కొత్త మెయిల్... ఫస్ట్ డిలీట్ చేద్దాం  అనుకుంది... బట్ సరేలే చూద్దాం ఏంటో అని... చూసింది...

హాయ్ సమంతా,
                     ఏమైనా బయపడ్డావా, సుజీత్ నా DEATH గురించి చెప్పాక.?
                  నేను కూడా నీలానే మొదట్లో బాగా workholic , నైట్ ఎక్కువ సేపు ఆఫీసు లోనే ఉండే వాడిని...ఫ్రెండ్స్ కూడా ఎవరూ ఉండేవారు కాదు... even weekends కూడా వచ్చి ఆఫీసు లో కూర్చొనే వాడిని.. NO SOCIAL LIFE , NO PARTYS , NO WEEKENDS . ఎప్పుడు చూడు ఆఫీసు లోనే.. ఆఖరికి నా DEATH కూడా ఆఫీసు లోనే... నువ్వు కుర్చ్చొన్న కుర్చీలోనే.. ఇప్పుడు నువ్వు వాడుతున్న సిస్టం, అప్పట్లో నేను వాడినదే.. నేను చనిపోయినప్పుడు  ఎవరు లేరు ప్రక్కన.. పోదున ఆఫీసు క్లీన్ చేసే వాళ్ళు వచ్చి చూసేదాక ఎవరికీ తెలియదు.. అలా తెల్లారే వరకు అనాధ శవం లా కుర్చోలోనే పడి ఉన్న.ఆ రోజు వర్క్ స్త్రెస్స్ చాల ఎక్కువ అయింది ... ఎంత అంటే.. నా బ్రెయిన్ తట్టుకోలేనంత... నేను నా హెల్త్ problems  అన్ని ignore చేశాను.. నేను ఆ రోజు రాత్రి 11 PM కి నా తుది శ్వాస విడిచాను... నేను నా లైఫ్ లో  చాల ఫన్ పార్ట్ ని మిస్ అయ్యాను.దానికి ఎంతో బాద పడుతున్నాను... 
               ఇప్పుడు నీకు అర్ధం అయి ఉంటుంది అనుకుంటా.. నేను ఎందుకు ASHI కి బయపడను అన్నానో.. నిన్ను చూసాక నా లైఫ్ గుర్తు వచ్చింది నాకు.. ఒకవేళ నేను బ్రతికి ఉన్న ASHI కి బయపడనేమో.. ఎందుకంటే నేను నిజం గా ప్రేమిస్తున్నాను... I REALLY LOVE YOU సమంతా... నేను బ్రతికి ఉంటె ఎంత బాగు... నీతో నా లైఫ్ మొత్తం స్పెండ్ చేసేవాడిని... కాని ఎం లాభం? నేను మల్లి బ్రతకలేను...నీతో జీవనం సాగించలేను...
కాని మనం ఇద్దరం కలవాలి...అందుకు ఒకటి జరగాలి. అంటే నువ్వు చావాలి... అది కూడా నేను చంపాలి లేదా నీకు నువ్వు చావాలి... ఇప్పుడు నీకు ఏది కావలి?

నీ మరణం కోసం వేచి చూస్తూ...నీ..

-- సమీర్ భెల్ ..
ఫైనల్లీ SOME LOVE STORIES HAVE GHOSTS ....

----------------------------------------------------------------------------------------------

హమ్మయ మొత్తం రాశేసాను,,,మీరు మొదటి బాగం చూస్తే ఆ రోజు నేను ఆఫీసు లో 10PM  దాక కూర్చొన్నఅని చెప్పాను.. ఈ కథ అంతా చదివే సరికి 11 PM అయింది.. అప్పుడు నాకు స్టార్ట్ అయింది భూమి కంపించటం.. ఫ్లోర్ లో ఒక్కడు కూడా లేడు ఆ రోజు... సరి అయిన టైం లో ఇరుక్కున్న అనుకున్న.. మా వాడిని కూడా తిట్టుకున్నా నాకు ఎందుకు ఈ మెయిల్ పంపాలి.. నేను కూడా ఈ టైం లోనే ఎందుకు చదవాలి... దేవుడా ఎలాగోలా గట్టేకించు...ప్లీజ్.. అనుకోని అమీర్ ఖాన్ వి రెండు పాటలు గుర్తు తెచ్చుకొని  ఇంటికి బైక్ మీద ఎన్నడు లేని స్పీడ్ తో వెళ్ళిపోయాను... విత్ అవుట్ శట్టింగ్ డౌన్ మై సిస్టం...  ఆ రెండు పాటలు ఏంటంటే..

Tuesday, May 3, 2011

జెస్సి (opera #1)

THIS STORY IS BASED ON TRUE RUMORS.........

హాయ్ సమంతా డార్లింగ్,
                      నీకు రోజు మెయిల్స్ చేస్తున్నాను, సలహాలు ఇస్తున్నాను... ఈ రోజు అలాంటివి ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ గా నా మనసులో మాట చెప్పేస్తాను. నువ్వు అంటే నాకు చాల ఇష్టం.ఐ థింక్ I`m IN LOVE WITH YOU. " I LOVE YOU SAMANTA" ... నువ్వు చాల అందంగా ఉంటావ్.. నువ్వు నీ బ్యూటీ మీద కొంచం concentrate చేస్తే చాలు,చాల అందంగా తయారవుతావ్. అప్పుడు ఆఫీసు లో చాలా మంది నీ వెనకాల పడతారు. ఇలా రోజు మెయిల్ చేస్తున్న నన్ను ఇంకా కొన్ని రోజుల్లో నువ్వు ప్రేమించటం స్టార్ట్ చేస్తావ్. తొందరలో మనిద్దరం  DATE కి కూడా వెళ్తాం...
                   నీకు BYE చెప్పే ముందు ఇంకొక చిన్న కాంప్లిమెంట్, నీ నవ్వు చాల అందం గా ఉంటుంది. సో కీప్ స్మైలింగ్...
TAKE CARE DARLING...  CU 
-- సమీర్ 

తన INBOX లో ఉన్న ఈ మెయిల్ చూసి సమంతా షాక్ అయింది... తను ఎప్పుడు చూడని, మాట్లాడని, కలవని ఒక అపరిచిత వ్యక్తి తనకు ప్రపోస్ చేసాడు...ఎవరితను? ఎందుకు నా వెనక పడుతున్నాడు? అలా ఆలోచిస్తూ మొదటి సారిగా తనకి సమీర్  నుంచి వచ్చిన మెయిల్ గుర్తుకువచ్చింది...

ఏమండోయ్.. ఒక్క నిమిషం... సమంతా ముందు చక్రాలు తిరిగి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళే లోపు.. తన గురించి, ఈ సమీర్ గురించి చిన్న పరిచయ వాక్యాలు చెబుతాను నేను...
పేరు: సమంతా 
వయసు: 25 
వృత్తి:  SOFTWARE ENGINEER IN A REPUTED MNC COMPANY 
జీతం: నాకు తెలియదండి...ఎందుకంటే IT వాళ్ళు తమరి జీతం రివీల్ చేయరు అంటా... (INFACT నేను కూడా చేయను అనుకోండి నా జీతం)
           పేరుకి తగ్గట్టు చక్కని రూపం ( "ఏం మాయ చేసావే" సినిమా లో జెస్సి లా ). ఒకటే వర్క్ హాలిక్ , అందరు పని దెయ్యం అంటారు తనని. ఎవరితో మాట్లాడదు,కలవదు. చాల తక్కువ కల్లీగ్స్ తో బయటకి వెళ్ళటం.ఎంతో బలవంతం చేస్తే గాని వెళ్ళదు అది కూడా . రోజు తను ఒక్కతే lunch కి వెళ్తుంది..ఫ్రెండ్స్ ఎవరు లేరు.పని, పని, పని... ఇది తప్ప ఏమి తెలియదు.. రోజు పోదున్నే 9AM కల్ల ఆఫీసుకి  రావటం, రాత్రి 10PM దాక పని చేయటం.. ఒకోసారి 11PM వరకు.ఇదే తనకి తెలిసింది... వేరి రిసర్వ్ద్...
ఇగ మరి మన హీరో గారి విషయానికి వస్తే ...
పేరు: సమీర్ భెల్ 
వయసు: 27
వృత్తి:  SOFTWARE ENGINEER IN A REPUTED MNC COMPANY 
జీతం: తెలీదు...
               ఇతను కూడా మొదట్లో తన లాగే పని రాక్షసుడు.. కాని 2 ఏళ్ళ నుంచి మారాడు... ఇప్పుడు ఆఫీసు లో పని తక్కువగా చేస్తున్నాడు.. లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు...

అరె సమంతా ముందు చక్రాలు తిరగటం ఆగాయ్ అన్డోయ్.. అంటే ఇప్పుడు మనం తన గతం లోకి వెళ్ళాం అనమాట .. అదే తనకి మొదటి సారి మన హీరో గారి నుంచి వచ్చిన మెయిల్ గురించి...

హాయ్ సమంతా,  
                     నేను నిన్ను చాల రోజులనుంచి గమనిస్తున్నాను... బాగా రాత్రి అయ్యేవరకు వర్క్ చేస్తున్నావు.. ఆరోగ్యం గురించి అసలు పట్టించుకోవటం లేదు.. నీకు ఎవరు ఫ్రండ్స్ లేరా? ఎప్పుడు ఒక్కదానివే కనిపిస్తావ్... నీకు నీ ఫ్రెండ్స్ తో గాని రూం మేట్స్ తో గాని మాట్లాడాలని అనిపించదా..? ఎందుకు అలా ఉంటున్నావ్...? ఇలా లేట్ నైట్స్ ఆఫీసులో ఉండటం మంచిది కాదు...ఇది నా సిన్సియర్ సలహా.. తప్పుగా అనుకోవద్దు ప్లీజ్...
-- సమీర్ భెల్

మెయిల్ చూడంగానే సమంతాకి చాల కోపం వచ్చింది.. ఇతనెవరు నాకు సలహా ఇవ్వటానికి అనుకోని జస్ట్ దాని చెత్తకుండిలోకి పంపింది... ఆ తర్వాత  AS USUAL గా చాల మెయిల్స్ వస్తూనే ఉన్నాయ్... కాని తను పట్టించుకోకుండా వాటిని డిలీట్ చేస్తుండేది.. కొన్ని రోజులకి ఒక రోజు మెయిల్ సబ్జెక్టు లైన్ వచ్చి.." HI GORGEOUS " 

HEY GORGEOUS ,

                           ఈ రోజు నువ్వు సూపర్ గా ఉన్నావ్ రా..! నిజం ఇంత అందంగా ఎప్పుడు నువ్వు నాకు కనిపించలేదు...రెడ్ సారీలో నువ్వు చాల అందంగా ఉన్నావ్... కొంచం హెల్త్ కేర్ తీసుకోర ప్లీజ్...
-- సమీర్ భెల్

(మళ్ళి చక్రాలు తిరిగాయండి , అదీ రివర్స్ లో ... అంటే మనం ప్రెసెంట్ లోకి  వచ్చేసాం అనమాట .!)
ఇలా తనకి కేరింగ్ సలహాలు ఇస్తూ ,రోజు మెయిల్స్ పంపిస్తున్నా... పట్టించుకోని సమంతా ఒక్కసారే ప్రేమ గురించి చెప్పేసరికి ఎక్కడ లేని కోపం వచ్చింది..ఇక లాభం లేదు, వీడిని కొంచం మందలిస్తే గాని దారికి రాడు అనుకోని రిప్లై ఇచ్చింది... ఇదే తన మొదటి రిప్లై మన హీరో గారికి...

హలో సమీర్,
                 మీరు ఎవరో నాకు తెలియదు... ఇలా నాకు మెయిల్స్ పంపకండి... నాకు ఈ ప్రేమ,దోమ అంటే చాల చిరాకు.. మీ కెరీర్ పాడు అవుతుంది అని ఇంతవరకి ఎవ్వరికి చెప్పలేదు.. మీరు ఇలానే మెయిల్స్ పంపిస్తుంటే నేను ASHI(ANTI SEXUAL HARASSMENT INITIATIVE) కి చెప్పాల్సి ఉంటుంది.. మైండ్ ఇట్..
- సమంతా 

ఈ మెయిల్ పంపాక తనకి చాల రోజుల వరికి అతని దగ్గరి నుంచి మెయిల్స్ రాలేదు.. సమీర్ రియలైస్ అయ్యాడు అనుకోని తను సైలెంట్ అయ్పోయి అతని గురించి ఆలోచించటం మానేసింది...
కొన్ని రోజుల తర్వాత, ఎప్పటిలాగే లేట్ నైట్ వర్క్ చేస్తున్న తను, వర్క్ ఫినిష్ అయేసరికి రిలాక్స్ గా చైర్ లో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని కూర్చొంది.. సడన్ గా తనకి ఒక మెయిల్ అలెర్ట్.... ఆ మెయిల్ మన హీరో సమీర్ నుంచి.. మెయిల్ ఓపెన్ చేస్తే...

హాయ్ బ్యూటిఫుల్,
                        ఏంటి కళ్ళు మూసుకొని ఎవరి గురించి కలలు కంటున్నావ్? నా గురించేనా..? సారీ యార్...మెయిల్స్ కొంచం లేట్ గా రిప్లై ఇస్తున్నందుకు... కొంచం బిజీ గా ఉండటం వల్ల మెయిల్స్ పంపలేకపోయాను...నన్ను MISS అయ్యావ్ కదా..
అవును..!! ఏంటి నా మీద ASHI కి కంప్లైంట్ చేస్తావ..? అంటే నువ్వు అది చెప్పగానే నేను బయపడతాన? నువ్వు కంపైంట్ చేసినంత  మాత్రాన నీ మీద నా ప్రేమ పోదు హనీ..
LOVE YOU HONEY....
-- సమీర్ 

మున్గురలని వేలితో  సరి చేసుకొంటూ మెయిల్ చదువుతున్న సమంతా కి ఎమ్మటే ఇంకొక మెయిల్ సమీర్ నుంచి...

"STOP PLAYING WITH HAIR, GO HOME.. ITS TOO LATE.."
-- సమీర్ 

తన డెస్క్ దెగ్గర తను ఎం చేస్తుందో ఎమ్మటే చెప్పిన సమీర్ మెయిల్ ని చూసి షాక్ అయ్యి ఫ్లోర్ లో చూసింది ఎవరైనా ఉన్నారా అని... ఎవ్వరు కనపడలేదు... తను అనుకుంది ఏదో WILD GUESS అనుకోని ఆఫీసు నుంచి బయలుదేరుదాం అని స్టార్ట్ అవ్వబోతుంటే... ఇంతలో ఇంకొక మెయిల్...

"హే ఏంటి..? నా గురించి వెతుకుతున్నావ..? నా ప్రేమ కి పడిపోయావ నువ్వు?"
-- సమీర్

మెయిల్ చుసిన సమంతా  వెన్నులో చలి ఒక్కసారిగా పుట్టింది.. బయంతో కూడిన కంగారుతో కంప్యూటర్ ని డైరెక్ట్ గా స్విచ్ ఆఫ్ చేసి పరగులంగించుకుంది ఇంటికి...
 ------------------------------------ ఇంకా ఉంది -------------------------------------------------------

మిత్రులారా..!! ఇగ నా విషయానికి వస్తే ఒక రోజు ఆఫీసు లో పని ముగించుకొని నేను కూడా రిలాక్స్ అవుదాం  అని, చైర్ లో అలా వెనక్కి ఆనుకొని కళ్ళు మూసి కూర్చొన్నాను.. ఆ రోజు పొద్దునుంచి చాల బిజీ గా  ఉండే ..! ఆల్మోస్ట్ రాత్రి 10PM వరకు వర్క్ చేశాను . అలా రిలాక్స్ అవుతునప్పుడు, నాకు పొద్దున  నా ఫ్రెండ్ దగ్గరి నుంచి  ఈ కథ గురించిన మెయిల్ వచ్చిన సంగతి జ్ఞాపకం వచ్చి చదవటం స్టార్ట్ చేశాను.సో అలా చదువుతూ కూర్చొన్న ఈ కథని.. తర్వాత  కొన్ని రోజులకి పాత మెయిల్స్ చూస్తుంటే ఈ మెయిల్ కంట పడింది. సో  ఈ కథనీ టపా గా బ్లాగ్ లో రాయాలి అనిపించింది.. అందుకే  ఆ మెయిల్ ని , నా నరేషన్ లో కొంచం డిఫరెంట్ గా  రాస్తున్నాను ..

Friday, April 22, 2011

ఘోష

                           "ఏ దేశ చరిత్ర చుసిన ఏమున్నది గర్వకారణం.
                            నరజాతి చరిత్ర సమస్థం పరపీడన పారాయణత్వం "
 ఏ ముహూర్తాన అన్నారోగాని మహాకవి శ్రీశ్రీ .... ఇది అక్షరాల నిజమేమో..... 
ఎటు పోతుంది మన దేశం..  కుంభకోణాలు..అంతర్గత కలహాలు... మత చాంధసవాధం... వర్గ తారతమ్యాలు... అవినీతి... ఇది మన 120 కోట్ల జన సాంద్రత కలిగిన మన దేశం పరిస్థితి... ఇలాంటి వాటితో ఇంకా ఎన్నాళ్ళు.................

        గాంధి కలలుకన్న స్వరాజ్యం ఇదేనా..?
        విశ్వకవి రవీంద్రుని... గీతాంజలికి ప్రతిరూపం ఇదేనా?
        రాజకీయం అనే పదానికి కొత్త అర్థాని ఇచ్చారు.. మన అమాత్యులు.. 
రా అంటే రాక్షసంగా జ అంటే జనాన్ని కి అంటే కీడుచేసే యం అంటే యంత్రాంగం అని...
సరిగ్గా రాసారు పరుచూరి బ్రదర్స్.... బహుశా ఇది మన అమాత్యుల ఆగడాలు చూసి రాసి ఉంటారు.. 
పరిపాలన వ్యవస్థ , అస్తవ్యస్తంగా తాయారు అయినది.. ఒకటి, రెండు కోట్లకు అమ్ముడు అయ్యే మంత్రులు.. విధాన సభ అమాత్యులు...
వీరా..! రాష్ట్ర నిర్దేశం ఆ పైన దేశ నిర్దేశం చేసేది...  దేశ భవితకు మార్గం చూపాల్సిన నాయకులే, ఇలా భవితని తుంగలో తొక్కుతుంటే... ఏమైపోతుంది మన దేశం.. ?

         గాంధీ గారు... విశ్వ కవి లేకపోవటం మంచిది అయింది ఏమో ?.. లేకపోతే ఈ కుళ్ళు చూడలేక దేశానికి ఎందుకు స్వేచ్చని తెచ్చాం అని భాధపడెవారేమొ..!!
ఒక రాష్ట్రానికి ఎన్నికలు వస్తే ఎందుకు ఇంత కరప్షన్...... ఎక్కడ నుంచి వస్తుంది... ఇంత మనీ...? కొంత మంది వ్యాపారస్థులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీ ఫండ్ పేరిట ఎంతో డబ్బుని పార్టీలకి అప్పజెప్పి జనాలకు డబ్బు, మద్యం పంచుతున్నారు... నా అనుభవంలో నేను స్వయంగా చూసాను.. కిందటి సారి ఎన్నికలప్పుడు తాపీ పని లేదా కూలి పనిచేసే కూలీలు నాయకులు ఇచ్చే నూటపది రూపయల కోసం కూలి పని మానేశారు... రెండు గంటలు జై అని చెప్పి నాలుగు వీధులు తిరిగితే చాలు... ఒక రోజు కూలి మందం డబ్బులు వచ్చేస్తాయ్... ఇంకా ఎందుకు కూలిపనికి  పోవటం అని ప్రతి ఒక్కరు అందులోని సుఖం ఎతుకున్టున్నారు... ఎలా ఇలా ప్రజలు ఉంటె...?
బడా బిజినెస్స్ పీపుల్ ఇచ్చిన ఆ డబ్బు ని జనాలకి పంచి ఓట్లు వేయించుకుంటున్నారు..  అలా ఆ డబ్బులతో గెలిచిన పార్టీ లు అలంటి వ్యాపారస్తులకి కొమ్ము కాస్తూ వారికి అనుకూలంగా రాజ్యాంగ సవరణలు.. కాంట్రాక్టులు
ఆఖరికి సత్యం చెప్పవలిసిన దిన పత్రికలూ కూడా నోటు కి అమ్ముడుపోతే, ప్రజాస్వామ్యం కూడా ఆ నోటు మీదనే నడుస్తుంది. 
                "నోటుకి వోటు అమ్ముడుపోతే ఈ నాయకులు కోట్లకి కోట్లు కూడబెట్టుకుంటారు..."
నోటుతో ఓటు కొనుకున్న నాయకులు విధానసభ, విధానాలనే సవరిస్తున్నారు..  ఎన్ని వత్సరాలు అయింది ప్రజల సమస్యలు చర్చించి.. దానికి కావాల్సిన చట్టం అమలు అయ్యి...? బిల్ పాస్ అవటం జరిగి?
శ్రీశ్రీ గారు ఒక పాటలో ఇలా రాసారు..
" స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబరపదిపోగానే సరిపోదోయి.. " ఇప్పటి పరిస్థితి చూస్తే నాకు అలానే ఉంది.
 దేశం మనదే కాకపోతే మనవాళ్ళే పరాయి వాళ్ళలాగ అయ్పోయారు...
ఎక్కడిదాకో ఎందుకు మొన్న జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఎంత డబ్బు ఏరులు అయి పారింది?
ఒక్కొక్క విద్యార్ధికి ఒక లాప్టాప్ ఉచితం అని ఒక పార్టీ ప్రకటిస్తే.. ఇంకొక పార్టీ ఆడపడుచులకి నాలుగు గ్రాముల  బంగారం ఉచితం...
ఎక్కడనుంచి వచ్చాయ్ ఈ డబ్బులు?
ఎన్ని లక్షల కోట్లు అవినీతి చేస్తే వచ్చాయి ఈ డబ్బులు?
మన రాష్ట్ర పరిస్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది.. వేల కోట్ల డబ్బులు పంపిణి చేసారు, ఓట్లు కొనటానికి. ఒక్క వోటుకి Rs.500 లేదా అంతకన్నా తక్కువ.. 
"పదవి వ్యామోహం, కులమతబెధాలు, భాషద్వేశాలు, వర్గ తారతమ్యాలు చెలరేగు వేళ.. ప్రతి మనిషి మరియొకని దోచుకునేవాడే.. తన లాభం, తన సౌక్యం చూసుకునేవాడే..స్వార్ధమే అనర్ధకారణం, దాన్ని చంపుటయే క్షేమదాయకం.."
 నేను మన దేశం మాత్రం గురించే చెప్పటం లేదు.. ప్రపంచం లో ఏ మూలకి వెళ్ళిన ఇదే పరిస్థితి.. అందుకే అన్నారేమో మహాకవి శ్రీశ్రీ., ఒక్క జాతి కోసం కాదు ప్రపంచం కోసం తన ఘోష ఇలా...

                " నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్చనలు పోతాను
                  నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుకమిచ్చి మ్రోస్తాను...
                  నేను సైతం ప్రపంచాజ్యపు తెల్లరేఖయ్ పల్లవిస్తాను.
                  నేను సైతం.. నేను సైతం..బ్రతుకుబాటకు గొంతు కలిపేను
                  సకలజగతిని శాశ్వతంగా వసంతం వరియించుదాక...
                  ప్రతిమనిషికి జీవనంలో నందనం వికసించుదాక..
                  నేను సైతం.. నేను సైతం...నేను సైతం....నేను సైతం"

అవినీతి.. బంధుప్రీతి, చీకటి బజారు.. అలముకున్న ఈ దేశం ఎటు దిగజారు..?
మన దేశ ప్రజలు ఎలా ఇలా డబ్బులుకి ఓట్లు అమ్ముకుంటున్నారు .. ఆలోచించలేర.. ఒక్కసారి?
దేశ భవిత యువతపై  ఆధారపడి ఉంది అంటారు... మరి మన దేశ యువత పరిస్థితి ఏంటి? 
నాకు ఇంకా గుర్తు మూడు సంవత్సారాల క్రితం..  గాంధి జయంతి ఆ రోజు.. ఒక TV చానెల్ ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసింది.. అందులో భాగంగా కొంతమంది యువతని గాంధి గురించి ప్రశ్నించింది.. అలా ఒక బైక్ మీద వెళ్తున్న ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి వెళ్తున్న బండి ఆపి అడిగారు..గాంధి గురించి అండ్ ఆయన జన్మదిన రోజు చెప్పమని.. వాళ్ళు ఆ ప్రశ్నకి ఇచ్చిన సమాధానం "మాకు తెలియదు" అండ్ దట్ గర్ల్ సైడ్ " I THINK ITS IN ఆగష్టు OR SOME OTHER MONTH" మేము పనిలో వెళ్తున్నాం.. మమ్మల్ని డిస్టర్బ్ చేయద్దు.. మీ సోది ప్రోగ్రామ మీరును అని.. అని ఆ TV చానెల్ వాల్నే బెదిరించింది.. 
ఛి ఛి.. ఇంతకంటే సిగ్గు చేటు లేదు..
గురజాడ గారు అన్నట్టు.. "దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్.." 
 సో దేశం బాగుపడాలి అంటే ముందు ప్రజలు మారాలి..తరువాత నాయకులూ మారతారు.. 
అవినీతి నిర్మూలన కోసం అన్న హజారే లాంటి వ్యక్తులు చేసే పోరాటానికి నేను పూర్తిగా మద్దతు ఇస్తాను. దేశప్రగతికి నావంతు నేను చేసే బాధ్యతా ఇదే..
అంతకంటే ఏమి చేయలేని ఒక సామాన్య, మధ్యతరగతి మనిషిని నేను.. చేతాకని వ్యవస్థలో.. చేతకాని సామాన్యున్ని...
"తల్లి..!! భారతమాత...!!! క్షమించు అమ్మా... నీ బాగు కోసం ఏమి చేయలేని అభాగ్యున్ని..."
నాలాంటి అభాగ్యులు ఎదురుచూసే మార్పు ఎప్పుడు సంభవిస్తుంది.?
"పతితులార... బ్రష్టులార..బాధాసర్పధ్రష్టులార.. దగాపడిన తమ్ములార..ఏడవకండి ఏడవకండి..
జగనాద రథచక్రాలు వస్తున్నాయ్.. వస్తున్నాయ్.. రథచక్ర ప్రళయఘోషతో భూమార్గం పట్టిస్తాను.. భూకంపం పుట్టిస్తాను.. "
అన్నారు శ్రీశ్రీ.. ఎప్పుడు వస్తాయ్..? ఆ రథచక్రాలు మరి?

Wednesday, April 6, 2011

నవరసాల్లో చావు గోల

రేయ్. అనుదీప్...! నీకొక మంచి టప రాసిపెట్టాలి అని డిసైడ్ అయ్యానురా.. - పాండు
ఏంటిరా... మందు కాని కొట్టావ లేక బ్రెయిన్ పని చేయటం స్టార్ట్ గాని చేసిందా.? టప రాస్తాను అంటున్నావ్... - అనుదీప్
ఏడ్చావ్ లే..! పింజారి మొకమోడ ..! నేను మందు తాగటం ఏంటి... ? నా బుర్ర ఎప్పుడు షార్ప్... పట్టుకొని చూడు చెయ్ తెగుద్ది... - పాండు
వద్దులేరా బాబు.. ఇప్పుడు నా చేయి కోసుకోలేను కాని.. ఎప్పుడు అయిన కూరగాయలు తరగటానికి కత్తి దొరక్కపోతే నీ తల వాడుతాను.. - అనుదీప్
ఏంటి వెటకారంనా? -- పాండు
కాదురా .. గొడ్డు కారం ... - అనుదీప్
సరే ఇంతకి ఏంటి ఆ టప పేరు? - అనుదీప్
" నవరసాల్లో చావు గోల ".. ఎలా ఉంది టైటిల్ ? -- పాండు.
"నవరసాల్లో చావు గోల" ఒరేయ్ అడివి మనిషి..! శుభమాంటూ ఏదో నేను బ్లాగ్ మొదలెడితే ఈ చావు గోల ఏంటిరా..? అక్కు పక్షి, నిరక్షర కుక్షి, అజ్హ్నాన కాక్షి... - అనుదీప్
టైటిల్ నే ఇలా ఉంటె.. ఇంకా విషయం ఎలా ఉంటది.. ఎందుకులేర బాబు LITE తీసుకో ఎందుకొచ్చిన గోల  - అనుదీప్
రేయ్.. రేయ్ అలా కాదురా .. మొత్తం నా యొక్క ఆలోచనల్ని రంగరించి ఒక కాన్సెప్ట్ అనుకున్న సో నువ్వు కాదనకూడదు.. ప్లీజ్ రా -- పాండు
సరే..!!  తగలడు.. ఎం చేస్తాం.. కర్మ అలా ఏడ్చింది నాది.- అనుదీప్
ఆ మాట మీద ఉండు.. పీక మీద బ్లేడ్ లా కోసుకుపోత, అరటి పండుని కోసినట్టు కోస్తా టప --- పాండు
 హే ఫ్రెండ్స్ ఎక్కువ ఉపోద్గాతం లేకుండా సీదా టప లోకి వెళ్లిపోదాం.. ఈ టప చదివితే నేను ఏంటో మీకే తెలుస్తుంది. " - పాండు
"""దేశ బాష లందు తెలుగు లెస్స అని ఏ ముహూర్తాన అన్నారో కానీ రాయలు వారు... నిజంగా నాకు అనిపిస్తుంది... తెలుగు బాష గద్య భాగానికి పద్య భాగానికి సరిగ్గా సరిపోతుంది. వాచకంలో తెలుగు బాష గొప్పధనమే వేరు.కొన్ని పదాల అమరిక బలే ఉంటుంది తెలుగులో.  తెలుగు భాషలో కొన్ని పదాలు వాడకం కేవలం మనకే సొంతం అని అనిపిస్తుంది. మచ్చుకి ఇప్పుడు మనం ఒక పదవాడకం తీసుకుందాం. అదే "చావు".

వీడేంటిరా బాబు.. తెలుగు, అది ఇది అంటాడు మళ్ళి చావు గురించి చెబుతాను అంటాడు ఏంటి అనుకుంటున్నారా...!! వస్తున్నా... అక్కడికే వస్తున్నా... చావు అనే పదాన్ని నాకు తెలిసి, తెలుగు లో ఉపయోగించినంతగా ఎక్కడ ఉపయోగించరేమో .. అని నా అభిప్రాయం.
అది ఏ రకమైన ఫీలింగ్ అయిన సరే....! విషాదం, ఆనందం, కోపం.... వగైరా...వగైరా...
నేను అనుకోవటం, నవరసాల్లో చావు అనే పదం బాగా వాడుకోవచ్చు అని.
విషాద సమయాన్నే తీసుకుందాం:  " చీ... చీ.... ఈ నరకం నా వల్ల కాదు. ఈ బాధ పడేకంటే ఇంత విషం మింగి చావటం నయం. " అని వింటుంటాం.. ప్రతి ఒక్క మనిషికి విషాద సమయాల్లో ఆకరికి వచ్చే పదం చావు నే..!
విషం మింగి చావటం లేదా ఇంకోవిధంగా చావాలని అనిపిస్తుంది... ఆత్మ్యహత్య. ఇవి అన్ని చివరికి వచ్చేది చావు కే...
ఆనంద సమయాల్లో కూడా మనం చావు ని వాడుకోకుండా ఏ వాఖ్యం పూర్తి చేయలేం అనిపిస్తుంది.
ఎవరు అయిన మంచి జోక్ చెప్పారు అనుకోండి... ఆ జోక్ పొట్ట చెక్కలు అయ్యేలా ఉంది అనుకోండి.. మనం ఏమి అంటాం.." రేయ్ ఆపరా బాబు.. నవ్వలేక చచ్చిపోతున్న..!! కడుపు చెక్కలు అయేలా ఉంది..."
ఈ బాగోద్వేకం లో కూడా మనం చావు లేకుండా పూర్తి చేయలేకపోయాం.
బాధలో ఉన్నాం అంటే అనుకోవచ్చు ఆనందం లో కూడా ఇదే...
ఏదైనా..! జరగరానిది జరిగింది అనుకోండి.. " చచ్చానురా. దేవుడా..!! ఇలా ఐపోయింది ఏంటి..? ఇప్పుడు ఎం చేయాలి..?" ఇక్కడ కూడా అదే చావు.
కోపంలో అయితే ఇంగ తిరుగే లేదు... చావు లేకుండా ఒక్క వాఖ్య కూడా చేయలేం అంటే నమ్మండి...
 ఉదాహరణకి : " రేయ్...వీర వంకరరెడ్డి చచ్చావుర నువ్వు...!! ఐపోయావ్ నా చేతిలో... అంతే... ఇగ..ఆకరిసారి ఇంటికి ఫోన్ చేసుకో..నువ్వు ఎలుకోనేదానితో కడసారి మాట్టాడుకో... నువ్వో...నేనో..తేల్చుకుందాం....ఏ సెంటర్ అయిన రెడీ.. ఎంత మంది అయిన తెచ్చుకో..సింగల్ గానే వస్తా...!!  ఎవడికి ఎంత దమ్ము ఉందో చూద్దాం. రేపు తెల్లారేసరికి   నీ శవం చూస్తా..! ఇది నా ఆన."
ఇది..ఎదో... ఫాక్షన్ సినిమాలో డైలాగ్ లా ఉంది కదా... మరి అంతే కదా... అంటే చావు గురించి చెబుతున్నాం... రౌద్రం లో కాస్త బలంగా ఉండాలి అని... కాపీ కొట్టేసాను...
కాదు కాదు కాపీ తో పాటు కొంచం టీ కూడా కలిపి కొట్టాను.
సినిమా డైలాగ్ అంటే గుర్తుకు వచ్చింది అండి. మన సినిమాల్లో ఈ చావు మీద డైలాగ్లు అని BUMPER హిట్. రవితేజ విక్రమార్కుడు సినిమానే తీసుకోండి, " చావు అంటే బయపడటానికి అల్లాటప్ప గల్లి రౌడీని కాదుర... రాథోడ్..  విక్రం రాథోడ్. భయం నాకు కాదుర..! చావుకి.. అందుకే పిచ్చికుక్కలా నా వెనకాలే తిరుగుతుంది.." ఊహూ.. ఈ డైలాగ్ వినగానే ఒకటే ఈలలు, కేకలు ధియేటర్లో.. 
ఇంకొక సినిమాలో మన బాలయ్య బాబు... డైలాగ్ ఏంటి.. ఆహ ఏంటి అసలు.. మనందరి ఫేవరేట్ " కత్తితో కాదురా..! కంటి చూపుతో చంపేస్తా.." మోస్ట్ పవర్ ఫుల్ డైలాగ్ ఇది..
సినిమాల్లో ఆవేశం కట్టలు తెంచుకున్న హీరో, చంపేది విలన్నే.....!!
నవరసాల్లో భీబత్సం మరియు భయానకం లో కూడా చావు దే కీలక పాత్ర...
ధక్షయజ్ఞంలో వీరభద్రుడు నానా భీభత్సం చేసాడు అంటారు..  ఇంతకి ఏంటా... భీబత్సం... ధక్షరాజు సేనల్ని అందరిని చంపటమే.
ఈ లోకంలో.... చావు కి బయపడని వాడు లేడు, అంటే అతిశయోక్తి కాదు ఏమో .. !
సో ఈ రెండు రసాలలో కూడా చావు యొక్క ప్రాముక్యత అవగతం అయినది కదా...
 ఇంగ మనకి మిగిలినవి .. శృంగారం, ఆశ్చర్యం, సహనం...
శృంగారం..  : నెచ్చెలి విసిరే వాలు చాపు తగిలితే చాలు ... చచ్చారే కుర్రకారు...  అందుకేనేమో... ఓ సినిమాలో "చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరె హాయ్..." అని పాట పెట్టారు... అమ్మాయిలు చూసే కొంటె  చూపు వామ్మో తట్టుకోవటం చాలా కష్టం అని అనిపిస్తుంది... అమ్మాయిలు ఒక నవ్వుతో కరుణిస్తే చాలు ఈ క్షణమే చచ్చిపోతం  అనే పిల్లకాయలు ఎంత మంది లేరు చెప్పండి.. శృంగారంకి ఇంకొకరకం గా చెప్పే కామం వల్ల ఎన్ని అనర్ధాలు జరిగాయ్... పెద్ద పెద్ద యుద్ధాలు జరిగి... ఎంతో మంది చచ్చారు... """"
ఇదే నేను చెప్పదలుచుకున్న చావు గోల... నవరసాలు అండ్ చావు ప్రాముక్యత... తెలుగులో చావు ఎంతగా అమరిపోయిందో చూసారుగా..
మిత్రులు అందరికి నా యొక్క ఈ చావు పురాణం  బాగా అవగతం అయినది అనుకుంట... మరి ఇక సెలవ పుచ్చుకుంట నేను టపా నుంచి..
                              ====  X ====
రేయ్ పింజారి..!! మరి మిగతా రెండు ఎందుకు వదిలేసావ్  - అనుదీప్
 ఏవి ? -- పాండు
అవేరా..! సహనం ఇంకా ఆశ్చర్యం -  అనుదీప్
ఏమోరా..! నాకు ఇంతవరకే వచ్చు అంతవరకే రాసాను..నీకు తెలిస్తే నువ్వు రాసుకో.. ఇలా అన్ని అడిగితే కష్టం నాన్నా..  BYE మరి -- పాండు.
ఓసి నీ అఘాయిత్యం కూల.. నేను ఎక్కడి నుంచి రాయను.. కాన్సెప్ట్ నీది కాబట్టి నువ్వే చూడాలి నాకు ఎలా తెలుస్తుంది.. - అనుదీప్
ఫ్రెండ్స్, చూసారుగా..!! మన పాండు గాడు ఎలా వదిలేసాడో, సో మీలో ఎవరికీ అయిన చావు ని ఆశ్చర్యం ఇంకా సహనం లో ఎలా వ్యక్తపరచాలో తెలిస్తే మా పాండు గాడికి చెప్పగలరు అని మనవి. సరే మిత్రులారా సెలవు తీసుకుంటా ఇగ.. - అనుదీప్
"ఈ పాండు గాడిని ఇరగ తన్నాలి..ఇంకొకసారి టపా అంటే చంపుత వాడిని .." - అనుదీప్

Tuesday, March 8, 2011

ప్రవళిక

ఉదయం 9 గంటలు. భానుడి వెలుగుకి నిదుర కళ్ళతో లేచి సమయం చూసుకుంది ప్రవళిక.  
" అయ్య బాబోయ్...!!!! బారెడు పొద్దు ఎక్కింది. ఇంకా ఎమన్నా ఉందా..!! ఆఫీసుకి లేట్ గా వెళ్తే మేనేజర్ తోలు తీస్తాడు"

అనుకుందే తడవుగా హడావిడి గా లేచి వాశ్రూం లోకి పరుగు లంగించుకుంది. బ్రష్ నోట్లో పెట్టుకొని అద్దం లోకి చూస్తూ రాత్రి జరిగిన గొడవ గురించి ఆలోచిస్తుంది. కట్ చేస్తే,
" నాన్న..! అతని పేరు పార్థు. నాతో పటు పనిచేస్తారు. మేము ఇద్దరం జాబులో జాయిన్ అయిన దెగ్గర నుంచి తెలుసు. బాగా  పరిచయం అది కాస్త ప్రేమ గా మారింది. పెళ్ళంటూ చేసుకుంటే పార్థునే చేసుకుంటా." అని కరాకండిగా చెప్పింది వాళ్ళ నాన్న రంగారావు గారికి మళ్ళి...
"అమ్మాయ్..!! నేను నీకు చాలా సార్లు చెప్పాను. నాకు అతను అంటే ఇష్టం లేదు." - రంగారావు.
"నన్ను బాగా చూసుకుంటాడు  నాన్న..! మిమ్మల్ని చాలా గౌరవిస్తాడు. " - ప్రవళిక
"ఒకసారి చెపితే అర్ధం కాదా.? ఈ టాపిక్ మన ఇంట్లో నడవబట్టి నెల అవుతుంది. ఎలా చెబితే నీ బుర్ర కి ఎక్కుతుంది..? ఎందుకు మీరు పెద్దోళ్ళ మాట వినరు. ప్రేమ కి ఇద్దరు సరిపోతారు ఏమో..!! బట్ పెళ్లి కి రెండు కుటుంభాలు కావాలి" - రంగారావు గారు.
"అసలు నీ మొఖం చూసుకున్నవా.? ఎలా ఉందో చూడు నిదుర లేక..నీకు నిదుర లేదు, మాకు నిదుర లేదు.. ఎందుకు ఇంత మొండి గా చేస్తున్నావ్..? నిన్న నీ రూం లో చెక్ చేస్తే అమ్మకి స్లీపింగ్ పిల్ల్స్ దొరియాయి అంట. అసలు ఏమి అయిపోతున్నావురా నువ్వు? మా మంచి అమ్మ కదా..!! మాట విను అమ్మ..! ప్లీజ్.. వొద్దు. ఆ పిలగాడి వాళ్ళ ఫ్యామిలీ మంచిది కాదు అంట. " - రంగారావు గారు.
" నాన్న.!! మీరు నా మాట వినరే.. మీరే మొండి గా చేస్తున్నారు.. మా ప్రేమ అర్ధం చేసుకోవటం లేదు.  మన ఇంట్లో ఈ విషయం తెలిసినప్పటి నుంచి మీరు సరిగా మాట్లాడటం లేదు నాతో.  అన్ని అమ్మే చుస్కుంటుంది. నేను అంత పరాయి అయిపోయాన? చెప్పండి నాన్న.?" - ప్రవళిక
"ఆఫీసు వర్క్ టెన్షన్ తో నేను చాలా సతమతమవుతున్న  ఆపైన ఇంటికి రాంగానే ఈ నస.. చచ్చిపోవాలని  అనిపిస్తుంది. " - ప్రవళిక

"ఒకటి మాత్రం నిజం నాన్న..! పార్ధుకి  నేను అంటే ప్రాణం.. అయిన పెళ్లి అయాక ఇద్దరం కలిసి వేరే ఉంటాం. మేము ఢిల్లీ లో సెటిల్ అవుదామని అనుకుంటున్నాం." - ప్రవళిక

"మీరు ఇలా ఎన్ని రోజులు నాతో arguement చేసిన ప్రయోజనం ఉండదు. అల కాదు అని బలవంత పెడితే నా శవాన్ని చూస్తారు. " - ప్రవళిక
" నీకు ఎందుకు అమ్మ అంత కష్టం .? నువ్వే మంచిగా ఉండు మేమే ఇంత విషం తాగి చస్తాం. నిన్ను కన్న పాపానికి మేమే పోతాం. మీరు రండి భోజనం చేద్దురు గాని " కళ్ళ తుడుచుకుంటూ వంటగదికి వెళ్లిపోయింది రంగారావు గారి భార్య వాణి. 
" నాకు ఏమి వొద్దు వాణి.! చాలు... నా కూతురు నాకు కడుపు నింపింది" - రంగారావు గారు.
వాణి కూడా రంగారావు గారిని అనుసరించింది. ఇంగ అక్కడ ఒక్కతే మిగిలిపోయింది ప్రవళిక.  అలా... వేదన తో నిండుకున్న మనసుతో.. నీళ్ళతో నిండుకున్న కళ్ళతో... బెడ్రూం కి తను కూడా ఏమి తినకుండా పరుగు తీసింది.
           ఆఫీసు లంచ్ టైం లో కూడా, పార్ధు ఎంత ఫొర్స్ చేసిన తినలేదు తను.
 అద్దంలో తన్ని తాను చూస్తు మళ్ళి అనుకున్నది. " అప్పట్లో ఎంత అందం గా ఉండేదాన్ని . ముఘ్ద  మనోహర రూపం అనేవారు ఇంట్లో వాళ్ళు అంతా.. అందుకే అంత వెంట పడ్డాడు పార్ధు. బాపు బొమ్మరా ..! నువ్వు అనేవాడు. నేను వొద్దు అని ఎంత వారించిన వినలేదు. అంత అందమయిన  అమ్మాయ్... ఏంటి ఇలా అయిపోయింది. డార్క్ CIRCLES , మొటిమలు, పాలిపోయిన మొఖం, తనేన ప్రవళిక..?  
పేరెంట్స్నా ? లేక పార్ధునా? ఎవరు ముఖ్యం నాకు...? ఎందుకు నా మాట వినటం లేదు ? నేను ఎప్పుడు ఏది అడిగిన తీసుకు వచ్చే నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారు? అడగకముందే అని తెచ్చే నాన్ననేన?  ఇలా మాట్లాడేది... ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? నేను ఎం తప్పు చేశాను? ప్రేమించటం తప్పా..? ఇది మిలియన్ డాలర్ ప్రశ్న..WHY THIS IS HAPPENING TO ME? దేవుడా ప్లీజ్ కరుణించు...!"
బెడ్ మీద పడుకొని నిదుర రావటానికి, ఈ టెన్షన్ నుంచి నిదుర పోవటానికి స్లీపింగ్ పిల్ల్స్ తీసుకుంది. ఎంతో ఒత్తిడి, సరి అయిన తిండి లేదు, ఏమి లేదు. 
            అలా నెల నుంచి తను,తనలా..లేదు. ఆలోచిస్తూ పడుకుండి పోయింది. 
వాశ్రూం నుంచి బయటకి వచ్చి ఎదావిధిగా "మమ్మీ.." అంటూ పిలిచింది ప్రవళిక. ఎటువంటి స్పందన లేదు అమ్మ దగ్గరి నుంచి.
"నాన్న..!!" మళ్ళి పిలుపు.. లేదు ఛాన్స్ నే లేదు.
రోజు రాత్రి  ఎంత గొడవ అవుతున్నా... నాన్న..అమ్మతో మళ్ళి పొద్దున breakfast చేసే వెళ్తుంది ఆఫీసుకి తను. 
సరిగా తినటం లేదు. నిన్న రోజంతా ఏమి తినలేదు, ఆఖలిగా ఉండటంతో టిఫిన్ చేద్దాము అని ఎంత పిలిచినా ఎవరు రావటం పలకటం లేదు. 
ఇంతలో రంగారావు గారు హాల్ లోకి వచ్చారు.
" వాణి..!! కాఫీ తీసుకురా. అని చెప్పి ఈనాడు తిరగేస్తున్నారు.
హాల్ లోకి అప్పుడే వచ్చిన రంగారావు గారిని నాన్న..! నాన్న అని పిలుస్తుంది. రంగారావు గారు అసలు పలకటం లేదు. 
" రాత్రి జరిగిన దానికి నాన్న.. నాతో పూర్తిగా మాట్లాడటం ఆపేసారా ఏంటి.  అయ్యే ఉంటుంది... రాత్రి మొదటి సారిగా నాన్న కళ్ళలో నీళ్ళు చూసాను. అమాంతం నాన్నని పట్టుకొని ఏడవాలి అని ఉంది కాని, నాన్న కనీసం విన్నా.. విననట్టే ఉంటున్నారు. అంత శత్రువుని అయిపోయాను.
" ఈ లవ్ చేసిన వాళ్లకి ఏంటి ఈ పరీక్ష? "
సరే..!! అమ్మని పిలుద్దాం అని పిలించింది.. హాల్ గుండా వంట గది కి వెళ్తున్న ఆమె కూడా నో రిప్లై. 
" వాణి.. అమ్మాయిని పిలువు ఎన్ని సార్లు చెప్పాలి నీకు? వెళ్ళు నీ వంట ఎప్పుడు ఉండేదే గాని పో వెళ్ళు... రాత్రి అది కూడా ఏమి తినలేదు..." - రంగారావు గారు.

" అబ్బ పిలుస్తాను ఉండండి మీరును. " - వాణి 
అది కాదు వాణీ... ఒకసారి ఇలా రా..!! రాత్రి నిదుర పట్టక నేను బాగా ఆలోచించాను... తనే కరెక్ట్ నేమో..!! ఒప్పుకున్ధామా.. మరి? నువ్వు ఏమంటావ్? " - రంగారావు గారు. 

" అమ్మ.. నాన్న..!! ఏంటి మీరు పిలుస్తుంటే పలకరు..? ఇంగ చాలు ఆపండి ప్లీజ్.. మాట్లాడండి నాతో.." - ప్రవళిక

" ఏమో అండి..!! అది అంత పట్టుదలగా ఉంది కదా...నేనూ మాట్లాడను ఆ అభ్భాయ్ తో... పిలగాడు మంచివాడే... ఇంగా వాళ్ళ ఫ్యామిలీ అంటారా...! తను ఎలాగా ఢిల్లీ లో సెటిల్ అవుతాం.. అంటుంది కదా..సో ఒప్పుకోండి.. మరి మీరు.." - వాణి

" సరే వెళ్లి పిలువు తనని.." - రంగారావు గారు.

" సరే వంట గదిలో పాలు దించి తన బెడ్రూం కి వెళ్తాను.." - వాణి

ఇంగ లాభం లేదు ఏదో ఒకటి తెల్చేద్దాం.. అని తన బెడ్రూం నుంచి బయటకి వచ్చింది. హాల్ లో ఉన్న తన తండ్రి దెగ్గరికి వచ్చి "డాడి.. ప్లీజ్ " అని గట్టిగ అరిచింది ఈ సారి కూడా ... నో రిప్లై...

"చాలు నాన్న...!! ఇంగ చాలు ఆపండి.. ప్లీజ్.. " - మోకాళ్ళ మీద ఆయన ముందు వాలిపోయి పిలిచింది  ఈ సారి... అస్సలు ఉలుకు పలుకు లేదు రంగారావు గారి దగ్గర , అసలు తను ఆయన ఎదురుగ లేనట్టే బెహేవ్ చేస్తున్నారు.
"అబ్బా...!!!!!!!!! సరే మీరు చెప్పినట్టే వింటాను నాన్న..!  ప్లీజ్.. నాతో మాట్లాడండి నాన్న..!!" దుఖ్ఖం తన్నుకొని వచ్చి ఏడుస్తూనే ఉంది. 

ఇంతలో ఏమండి...!! అని ఒక పెద్ద కేక వాణి దగ్గరి నుంచి... రంగారావు, చదువుతున్న పేపర్ అక్కడనే పడేసి అరుపు వినిపించిన వైపుకి పరుగెత్తారు.. 

"అయ్యో....!!! "అని ఆయన ఏడవటం స్టార్ట్ చేసారు..హాల్ లో కూర్చొని ఏడుస్తున్న ప్రవళికకి ఏమి అర్ధం కావటం లేదు.. ఏంటా అని తనూ, కంగారు గా పరుగు తీసింది అటు వైపు... అది తన బెడ్రూం నే..!!
అటు వైపు నుంచే.. ఆ రోదనలు..

బెడ్రూం దెగ్గరికి వెళ్లి, లోపల చుసిన తనకి పెద్ద షాక్ .. తన కళ్ళను తానె నమ్మలేకపోయింది.. 
 తన ఎదురుగా....
" బెడ్ మీద ప్రవళిక స్పృహ లేకుండా పడి ఉంది..."

 - ఫ్రెండ్స్..!! ఇక్కడ ప్రవళిక అండ్ రంగారావు గారు ఇద్దరు, చివరికి ఒకరికోసం ఒకరు ఒప్పుకునే పరిస్థితి వచ్చింది కాని అప్పటికే  జరగవలసిన అనర్ధం జరిగిపోయింది.  తప్పు ఎవరిది అంటారు?

Tuesday, February 1, 2011

అణుయుద్ధం

"అణుయుద్ధం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న పదం. అత్యంత శక్తివంతం ఐన America నుంచి... అల్పమైన zimbambwe వరకు ప్రతి ఒక్కరిని బయకంపితులని  చేస్తున్నది......."
         ఒకరోజు నేను ఆఫీసు లో తీరిక లేకుండా టైం ని ఎలా వేస్ట్ చేయలా అని ఆలోచిస్తున్న టైం లో నాకు ఒక మెయిల్ వచ్చింది... నా స్నేహితుడి దెగ్గర నుంచి... మనం బిజీగా ఉండటం వల్ల దాన్ని మల్లి చదవచ్చులే అని, పర్సనల్ ఫోల్డర్ లో పెట్టాను. మీరు పప్పులో కాలు వేయకముందే చెప్పేస్తాను లెండి...మా మేనేజర్ పక్కనే ఉండటం వల్ల, అప్పుడు చదవకుండా వాడు లేనపుడు చూద్దాంలే అని... మూవ్ చేశాను. అది సంగతి...!!   
        సమయం: సాయంత్రం 5 గంటలు , మా చెండశాసనుడు వెళ్లి పోయాక మా కొలీగ్ పంపిన మెయిల్ ఓపెన్ చేశాను.  ఆ మెయిల్ చదవమని వాడు ఒకటే నస. నాకు తప్పలేదు ఇగ. చదువుతూ పోతుంటే ఒకటే నవ్వు నాకు .. పొట్ట చెక్కలు అయ్యేలా..... ... కట్ చేస్తే ప్రెసెంట్ టైం ...మొదటి టప రాసేశాం... రెండవ టప రాయాలని ఒకటే ఆలోచిస్తుంటే ..!! అపుడు గుర్తుకు వచ్చింది నేను చదివిన ఆ మెయిల్ గురించి... సో అనుకున్న ఇగ..!  ఆ మెయిల్ నే ఒక టపాల రాసుకొని నా బ్లాగ్ లో స్టోర్ చేసుకుందాం అని... ఎవరో రాసారో ఈ షార్ట్ స్టొరీ కాని... బలే గా ఉంది అండి.... సరిగ్గా రాసారు... వాళ్ళు ఎవరు ఐన వాళ్ళకి నేను అంతగా నవ్వేల చేసినందుకు కృతజ్ఞతలు... సరే మనం ఇంగ టప మొదలెడదాం.... ..
                  " రేయ్.... అనుదీప్...అనుదీప్...
                  ఎవడ్రా అది టప రాద్దాం అనుకుంటే ఒకటే కేకలు వేస్తున్నాడు.. వెనక్కి తిరిగి చూస్తే  ఇంకెవరు....ది గ్రేట్ పాండు....హాఊ.. హాఊ.. హాఊ...!!
             నేను- "ఏంట్రా..."
             పాండు- " ఏంటిరా..? ఏం పీకిన్గ్స్.."
              నేను- " రెండవ టప రాస్తున్నారా....!!... అదే నేను 6 నెలల క్రితం వేణు పంపిన మెయిల్ ఉంది కదరా.. అది తెలుగు లో తర్జుమా చేసి నా బ్లాగ్ లో పెట్టుకుందాం ఎప్పటికి...అని... నాకు బాగా  నచ్చిందిరా.. ఆ మెయిల్ .. నీకు ఫార్వార్డ్ చేశాను కదా... అదేరా అణుయుద్ధం గురించి... అది..."
             పాండు- " ఓసదా.. గుర్హ్టు వచ్చింది..హా బాగుందిరా... నేను కూడా మస్తు నవ్వుకున్నాలే తీయ్.. 
                           రేయ్... రేయ్... నేను రాస్తానురా ఇది... నాకు ఆ భాగ్యం ఇవ్వు.. ప్లీజ్.." 
              నేను-   " ఏంటి నువ్వా...? మతి గాని పోయింది ఏంటిరా?... నీకు లవలేశమంతఐన జ్ఞానం లేదు నువ్వు ఎం రాస్తావ్... చల్ దోబ్బెయ్...."
             పాండు- " రేయ్.. అది కాదురా.. జస్ట్ తర్జుమానే కదా... నాకు వదిలేయ్... బాన్చాత్... నేను చూసుకుంటాను.."
              నేను-  " నువ్వు...తర్జుమా?   నా బొంద బాన్చాత్...తాజ్ మహల్ గురించి చెప్పరా అంటే కాస్త కామెడీగా ఎం చెప్పవో గుర్తు ఉందా నువ్వు లాస్ట్ టైం .?"
             పాండు- " ఓ ఎందుకు గుర్తు లేదు...కావాలి అంటే మల్లి చెపుతాను విను.. ` తాజ్ మహల్ చిత్రపటం కెళ్ళి చూపిస్తూ.. `   అదే చారిత్రాత్మక తాజ్ మహల్ కట్టడము... క్రి.శ. 1957 లో తాజ్ మహల్ టీ పొడి కంపనీ వాళ్ళు పుబ్లిసిటీ కోసం దాన్ని కట్టించారు....   అప్పుడు నువ్వు కూడా అన్నావ్ కదరా.. నన్ను పొగుడుతూ.. "రేయ్.. పాండు... చీకటి నిండిన నా జీవితంలో వేయి సిగరెట్ ల వెలుగు వెలిగించి నావు ".. అని..
              నేను-  చేసావులే పిడక... ఎదవ పింజారి పేస్ నువ్వును... ఇది నా బ్లాగ్.. నేను ఒప్పుకోను నువ్వు రాయటానికి...
              పాండు- రేయ్ అది కాదు రా ... ప్లీజ్.. బ్లాగ్ స్టార్ట్ చేసేటపుడు నాది వాటా ఉంది అని ప్రామిస్ చేసావ్ ప్లీజ్ రా..! నాకు అవకాశం ఇవ్వు ప్లీజ్...
              నేను-- సరే తగలడు.. ఎం చేస్తాం కర్మ...మాట ఇట్చన్ కదా కానివ్వు... ఓకే..!మిత్రులారా.. జర ఇనుండ్రి...
              పాండు-- థాంక్స్ రా...    సబకి నమస్కారం..
              నేను- సబ ఏంటిరా ?పింగళి వెంగలప్ప... ఇది బ్లాగ్.. ఇక్కడ రాయటమే ఉంటది... సొల్లు స్పీచ్ కాదు..
              పాండు- " ఓ సారీ ! అందరికి మంగిడీలు.. పరిచయం అవసరం లేని వ్యక్తిని నేను .. ఆల్రెడీ నా గురించి మొదటి టప లో ఉంది.. సో డైరెక్ట్ ఎటాక్ ఇగ..
                            అప్పుడు ప్రపంచం అంత ఒకరంటే ఒకరు ద్వేషంతో... పగతో బ్రతుకుతున్న రోజులు..అసూయ, అస్ప్రుహ తప్ప ప్రేమ, స్నేహం అనే పదాలకి అర్ధం లేదు.. అలాంటి రోజుల్లో ... అలా దేశాలు ఉన్నపుడు మొదటగా వచ్చే పేర్లు... AMERICA అండ్ RUSSIA ...
                            ఒకవేళ అమెరికా తన అణుఆయుదాన్ని...రష్యా మీదకి లాంచ్ చేస్తే ... శాటిలైట్ టెక్నాలజీ తో ఆ విషయాన్నీ ముందుగానే పసిగట్టి అమెరికా ఎత్తుకి పై ఎత్తు వేసి కౌంటర్ ఎటాక్ చేస్తుంది... ఇది వాళ్ళ ఇదరి మధ్య ఉన్న సంగతి... ఇలాంటి పరిస్థితే అస్మదీయులు, తస్మదీయులు ఆయన హిందుస్తాన్ అండ్ పాకిస్తాన్ మధ్యలో ఎలా ఉంటుందో చూద్దాం...
                           పాకిస్తాన్ ఆర్మీ ఎలాగ ఐన న్యూక్లియర్ మిస్సైల్ ని లాంచ్ చేయాలి అని డిసైడ్ అవుతది... దీనికి వారికి ఎలాగో పాకిస్తాన్ GOVT పర్మిషన్ తో పని లేదు కనుక కౌంట్ డౌన్ స్టార్ట్ చేయమని ఆర్మీ చీఫ్ ఆర్డర్ పాస్ చేస్తాడు... మన ఇండియాధీ  చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ... వాళ్ళు కౌంట్ డౌన్  స్టార్ట్ చేయాలి అని అనుకునే దానికి 8 సెకన్ల ముందే తెలిసిపోతుంది... --అది ఎలాగా అని ప్లీజ్ అడగద్దు....
 ఇండియన్ ఆర్మీ కౌంటర్ ఎటాక్ గా తన మిస్సైల్ లాంచ్ చేయాలని అనుకుంటుంది... ఎమ్మటే ప్రెసిడెంట్ అఫ్ ఇండియా కి పర్మిషన్ కోసం ఆర్జీ పెడుతుంది.. ప్రెసిడెంట్, ఆమోదం కోసం మంత్రిమండలి కి పంపిస్తారు..
ప్రధానమంత్రి ... అన్ని పార్టీల అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని ఒక్క ముక్క లో EMERGENCY గా వివరించి సభ ఆమోదం కోసం జీఓ 777 ని ప్రవేశ పెడతారు  .. కుంభకోణం గురించి మాట్లాడుతారు అనుకోని ముందుగా తయరు చేసిన పేపర్ వర్క్ తో లోఖ్ సభ కు వచ్చిన ప్రతిపక్షాలు,మిత్ర పక్షాలు విస్తుపోయి ... ముందు ప్రేపరేషన్ లేని టాపిక్ అవ్వటం వల్ల, ఎం మాట్లాడాలో అర్ధంకాక... ఈ  జీవో ని నిరసిస్తూ,ఖండిస్తూ, పోడియం వధకు దూసుకు పోయి రచ్చ, రచ్చ చేస్తే.. ఎం చేయాలో అర్ధం కాని స్పీకర్, సభని 5 నిముషాలు వాయిదా వేస్తారు ... 5 నిమిషాల్లో కూడా ఏమి ప్రిపర్ కాని అన్ని పక్షాలు, సభ నుంచి  వాక్ అవుట్  చేస్తాయి..     
                       ఇది అంత ఆల్-బాజీర చానల్ లో లైవ్  చూస్తున్న పాకిశ్తాన్ ఆర్మీ తనలో తాను నవ్వుకుంటు, మిస్సైల్ లాంచ్ చేయటానికి ట్రై చేస్తుంది.. టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ లాంచ్ ఆగిపోతుంది ఐన తన తదుపరి ఎటాక్ కోసం ఆ బగ్ ఫిక్స్ చేసే ప్రయత్నా లో మునిగిపోతుంది..  ఈలోపు రూలింగ్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్న మైనారిటీ పార్టీలు తమ సపోర్ట్ ని, ఉపసంహరించుకున్టై ... ఇదే అదనుగా  ప్రతిపక్షాలు కుంభ కోణాలు అవి ఇవి అని మీడియాతో చేతులు కలిపి  SITUATION ని DEVIATE చేసి GOVT పడిపోయేలా చేస్తాయి.. బల పరీక్షా లో నిరుపిన్చుకోలేకపోయన రులింగ్ పార్టీ మళ్లీ ఎన్నికలకు తెర దించుతుంది.. ఇక తప్పక రంగం లోకి దిగిన ప్రసిడెంట్, ఎన్నికలకు టైం లేదని , తాత్కాలిక ప్రభుత్వాని ఏర్పాటు చేసి పరిస్థితి అదుపులో వచ్చేలా చేయమని ఆదేశిస్తారు.. 
                    ఆ విధంగా.. ఏర్పాటు ఐన తాత్కాలిక ప్రభుత్వం.. న్యుక్లీయర్ మిస్సిల్ లాంచ్ కి ఆమోద ముద్ర వేస్తుంది... ఇది తెలిసిన ఎలక్షన్ కమీషన్, మిస్సైల్ లాంచ్ ని తక్షణమే ఆపి వేయాలని ఆదేశిస్తుంది.. ఎందుకు అంటే తాత్కాలిక ప్రభుత్వానికి ఆ అధికారం లేదు అని..  దీనితో ప్రభుత్వం సుప్రీం కోర్ట్ లో ఆర్జీ పెట్టుకుంటుంది..  అప్పుడు సుప్రీం కోర్ట్ రంగం లోకి దిగి , ఈ అత్యవసర పరిస్థితిలో ఈ ప్రభుత్వానికి నిర్ణయం తీసుకనే అధికారం  ఉంది అని తీర్పు ఇచ్చి.  ఎలక్షన్ కమీషన్ కి అక్షింతలు వేస్తుంది.. ఇది అంత ఆల్-బాజీర ఛానల్ లో చూస్తున్న పాకిస్తాన్ ఈ సరి మిస్సైల్ ని సక్సెస్ ఫుల్ గా TAKEOFF చేస్తుందిగాని.. గమ్య నిర్ధారణ లో పొరపాటు వల్ల తన దేశ రక్షణ శాక కార్యాలయం మీదనే ఉదయం 11 గంటలకు పడి పూర్తిగా ద్వంసం అవుతుంది.. లక్కీ గా  ఆ రోజు అంత త్వరగా ఎవరు రాకపోవటం వల్ల ఆస్తి నష్టం తప్ప ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా తప్పించుకుంటుంది... ఇలా జరిగినా  మళ్లీ తన నెక్స్ట్ మిస్సైల్ లాంచ్ కి ఏర్పాట్లు మొదలు పెడుతుంది..  ఈసారి USA , CHINA నుంచి బెటర్ టెక్నాలజీ ని ట్రై చేయటానికి ప్రయత్నిస్తుంది... 
                యుద్ధ నిర్ణయాధికారం వచ్చిన కొత్త ప్రభుత్వం జీఓ  777 పాస్ చేయాలని, అన్ని పార్టీ ల మీటింగ్ కి ఏర్పాట్లు చేసి మీటింగ్ కి ముందు.. తెలివిగా లగాన్ అండ్ చక్ దే ఇండియా సినిమాలు చూపించి, వాళ్ళలో దేశ భక్తి ని ప్రోది గొల్పి. ఆమోద ముద్ర వేయిన్చుకుంటుంది.. ఆ విధంగా ౩ నెలల నిరీక్షణ అనంతరం లభించిన పర్మిషన్ తో ఇండియన్ ఆర్మీ న్యూక్లియర్ మిస్సైల్ లాంచ్ కి సన్నాహాలు స్టార్ట్ చేస్తుంది... ఇది తెలిసన మానవ హక్కుల సంఘం , అణు ఆయుధ వ్యతిరేక సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకం గా నినాదాలు చేస్తూ.రాస్తా రోకో లు చేయటం, PM దిష్టి బొమ్మను దగ్ధం చేయటం లాంటివి కానిచ్చి , భారత్ బంద్ ప్రకటిస్తాయ్. అంతే కాకుండా వాషింగ్టన్ , కాలిఫోర్నియా లో ఉన్న వేలాది ఇండియన్స్ కి  ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఆమోద యోగ్యం కాని ఈ చర్య గురించి, ఈ మెయిల్స్ కుప్పలు తెప్పలు గా పోతాయి. సో కథ మళ్లీ మొదటికి వెళ్లి  మిస్సైల్ లాంచ్ ఆగిపోతుంది. 
              ఇగ ఒకసారి పాకిస్తాన్ విషయానికి వస్తే , ఒకేసారి అమెరియా అండ్ చైనా టెక్నాలజీ యూస్ చేయటం వల్ల మిస్సైల్ లో మాల్ ఫన్షనింగ్ జరిగి, మిస్సైల్ రాజస్తాన్, మధ్య ప్రదేశ్, ఒరిస్సా, బీహార్ లను ధాటి బంగాళఖాతం లో పడి వేలాది చేపలని చంపుతాయి... ఆ విధం గా సముద్ర జాలర్లకి శ్రమ తగ్గిస్తాయి...  అమెరికా అండ్ చైనా టెక్నాలజీ ఒకేసారి యూస్ చేయటం వల్ల ఫెయిల్ అయింది అని భావించి , ఈసారి ఏకం గా USA మిస్సైల్ నే స్మగల్ చేసి ఆపరేట్ చేయటానికి ట్రై చేస్తారు.. అమెరికా సాఫ్ట్ వేర్ అర్ధం కాక , ఏమి మార్పులు చేయకుండా లాంచ్ చేస్తారు.. అది వెళ్లి తన ఒరిజినల్ టార్గెట్ ఐన రష్యా తీరం వైపు దూసుకుపోతుంది..  రష్యా కౌంటర్ ఎటాక్ తో ఆ మిస్సైల్ కి చెక్ పెట్టి ఆ పైన ఇంకొక మిస్సైల్ లాంచ్ చేస్తుంది.  సక్సెస్ ఫుల్ గా .... దానితో ఇస్లామాబాద్ దెబ్బకి డా.. !!               
ఇస్లామాబాద్ ని కోల్పోయిన పాకిస్తాన్ సహాయం కోసం ప్రపంచ దేశాలని ఆశ్ర ఇస్తుంది... ఇండియా తన ప్రగాడ సానుభూతి తెలుపుతూ.. వాళ్ళ కోసం కొన్ని లక్షల్లో PARLE - G బిస్కెట్ లు పంపింది. 

ఫైనల్ గా  విషయం ఏంటి అంటే...

            " ఇండియాకి  ఎప్పటికి మిస్సైల్ ని లాంచ్ చేసే చాన్సు రాదు..
               పాకిస్తాన్ ఎప్పటికి సక్సెస్ ఫుల్ గా మిస్సైల్ ఆపరేట్ చేయలేదు....."