Friday, April 22, 2011

ఘోష

                           "ఏ దేశ చరిత్ర చుసిన ఏమున్నది గర్వకారణం.
                            నరజాతి చరిత్ర సమస్థం పరపీడన పారాయణత్వం "
 ఏ ముహూర్తాన అన్నారోగాని మహాకవి శ్రీశ్రీ .... ఇది అక్షరాల నిజమేమో..... 
ఎటు పోతుంది మన దేశం..  కుంభకోణాలు..అంతర్గత కలహాలు... మత చాంధసవాధం... వర్గ తారతమ్యాలు... అవినీతి... ఇది మన 120 కోట్ల జన సాంద్రత కలిగిన మన దేశం పరిస్థితి... ఇలాంటి వాటితో ఇంకా ఎన్నాళ్ళు.................

        గాంధి కలలుకన్న స్వరాజ్యం ఇదేనా..?
        విశ్వకవి రవీంద్రుని... గీతాంజలికి ప్రతిరూపం ఇదేనా?
        రాజకీయం అనే పదానికి కొత్త అర్థాని ఇచ్చారు.. మన అమాత్యులు.. 
రా అంటే రాక్షసంగా జ అంటే జనాన్ని కి అంటే కీడుచేసే యం అంటే యంత్రాంగం అని...
సరిగ్గా రాసారు పరుచూరి బ్రదర్స్.... బహుశా ఇది మన అమాత్యుల ఆగడాలు చూసి రాసి ఉంటారు.. 
పరిపాలన వ్యవస్థ , అస్తవ్యస్తంగా తాయారు అయినది.. ఒకటి, రెండు కోట్లకు అమ్ముడు అయ్యే మంత్రులు.. విధాన సభ అమాత్యులు...
వీరా..! రాష్ట్ర నిర్దేశం ఆ పైన దేశ నిర్దేశం చేసేది...  దేశ భవితకు మార్గం చూపాల్సిన నాయకులే, ఇలా భవితని తుంగలో తొక్కుతుంటే... ఏమైపోతుంది మన దేశం.. ?

         గాంధీ గారు... విశ్వ కవి లేకపోవటం మంచిది అయింది ఏమో ?.. లేకపోతే ఈ కుళ్ళు చూడలేక దేశానికి ఎందుకు స్వేచ్చని తెచ్చాం అని భాధపడెవారేమొ..!!
ఒక రాష్ట్రానికి ఎన్నికలు వస్తే ఎందుకు ఇంత కరప్షన్...... ఎక్కడ నుంచి వస్తుంది... ఇంత మనీ...? కొంత మంది వ్యాపారస్థులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీ ఫండ్ పేరిట ఎంతో డబ్బుని పార్టీలకి అప్పజెప్పి జనాలకు డబ్బు, మద్యం పంచుతున్నారు... నా అనుభవంలో నేను స్వయంగా చూసాను.. కిందటి సారి ఎన్నికలప్పుడు తాపీ పని లేదా కూలి పనిచేసే కూలీలు నాయకులు ఇచ్చే నూటపది రూపయల కోసం కూలి పని మానేశారు... రెండు గంటలు జై అని చెప్పి నాలుగు వీధులు తిరిగితే చాలు... ఒక రోజు కూలి మందం డబ్బులు వచ్చేస్తాయ్... ఇంకా ఎందుకు కూలిపనికి  పోవటం అని ప్రతి ఒక్కరు అందులోని సుఖం ఎతుకున్టున్నారు... ఎలా ఇలా ప్రజలు ఉంటె...?
బడా బిజినెస్స్ పీపుల్ ఇచ్చిన ఆ డబ్బు ని జనాలకి పంచి ఓట్లు వేయించుకుంటున్నారు..  అలా ఆ డబ్బులతో గెలిచిన పార్టీ లు అలంటి వ్యాపారస్తులకి కొమ్ము కాస్తూ వారికి అనుకూలంగా రాజ్యాంగ సవరణలు.. కాంట్రాక్టులు
ఆఖరికి సత్యం చెప్పవలిసిన దిన పత్రికలూ కూడా నోటు కి అమ్ముడుపోతే, ప్రజాస్వామ్యం కూడా ఆ నోటు మీదనే నడుస్తుంది. 
                "నోటుకి వోటు అమ్ముడుపోతే ఈ నాయకులు కోట్లకి కోట్లు కూడబెట్టుకుంటారు..."
నోటుతో ఓటు కొనుకున్న నాయకులు విధానసభ, విధానాలనే సవరిస్తున్నారు..  ఎన్ని వత్సరాలు అయింది ప్రజల సమస్యలు చర్చించి.. దానికి కావాల్సిన చట్టం అమలు అయ్యి...? బిల్ పాస్ అవటం జరిగి?
శ్రీశ్రీ గారు ఒక పాటలో ఇలా రాసారు..
" స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబరపదిపోగానే సరిపోదోయి.. " ఇప్పటి పరిస్థితి చూస్తే నాకు అలానే ఉంది.
 దేశం మనదే కాకపోతే మనవాళ్ళే పరాయి వాళ్ళలాగ అయ్పోయారు...
ఎక్కడిదాకో ఎందుకు మొన్న జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఎంత డబ్బు ఏరులు అయి పారింది?
ఒక్కొక్క విద్యార్ధికి ఒక లాప్టాప్ ఉచితం అని ఒక పార్టీ ప్రకటిస్తే.. ఇంకొక పార్టీ ఆడపడుచులకి నాలుగు గ్రాముల  బంగారం ఉచితం...
ఎక్కడనుంచి వచ్చాయ్ ఈ డబ్బులు?
ఎన్ని లక్షల కోట్లు అవినీతి చేస్తే వచ్చాయి ఈ డబ్బులు?
మన రాష్ట్ర పరిస్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది.. వేల కోట్ల డబ్బులు పంపిణి చేసారు, ఓట్లు కొనటానికి. ఒక్క వోటుకి Rs.500 లేదా అంతకన్నా తక్కువ.. 
"పదవి వ్యామోహం, కులమతబెధాలు, భాషద్వేశాలు, వర్గ తారతమ్యాలు చెలరేగు వేళ.. ప్రతి మనిషి మరియొకని దోచుకునేవాడే.. తన లాభం, తన సౌక్యం చూసుకునేవాడే..స్వార్ధమే అనర్ధకారణం, దాన్ని చంపుటయే క్షేమదాయకం.."
 నేను మన దేశం మాత్రం గురించే చెప్పటం లేదు.. ప్రపంచం లో ఏ మూలకి వెళ్ళిన ఇదే పరిస్థితి.. అందుకే అన్నారేమో మహాకవి శ్రీశ్రీ., ఒక్క జాతి కోసం కాదు ప్రపంచం కోసం తన ఘోష ఇలా...

                " నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్చనలు పోతాను
                  నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుకమిచ్చి మ్రోస్తాను...
                  నేను సైతం ప్రపంచాజ్యపు తెల్లరేఖయ్ పల్లవిస్తాను.
                  నేను సైతం.. నేను సైతం..బ్రతుకుబాటకు గొంతు కలిపేను
                  సకలజగతిని శాశ్వతంగా వసంతం వరియించుదాక...
                  ప్రతిమనిషికి జీవనంలో నందనం వికసించుదాక..
                  నేను సైతం.. నేను సైతం...నేను సైతం....నేను సైతం"

అవినీతి.. బంధుప్రీతి, చీకటి బజారు.. అలముకున్న ఈ దేశం ఎటు దిగజారు..?
మన దేశ ప్రజలు ఎలా ఇలా డబ్బులుకి ఓట్లు అమ్ముకుంటున్నారు .. ఆలోచించలేర.. ఒక్కసారి?
దేశ భవిత యువతపై  ఆధారపడి ఉంది అంటారు... మరి మన దేశ యువత పరిస్థితి ఏంటి? 
నాకు ఇంకా గుర్తు మూడు సంవత్సారాల క్రితం..  గాంధి జయంతి ఆ రోజు.. ఒక TV చానెల్ ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసింది.. అందులో భాగంగా కొంతమంది యువతని గాంధి గురించి ప్రశ్నించింది.. అలా ఒక బైక్ మీద వెళ్తున్న ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి వెళ్తున్న బండి ఆపి అడిగారు..గాంధి గురించి అండ్ ఆయన జన్మదిన రోజు చెప్పమని.. వాళ్ళు ఆ ప్రశ్నకి ఇచ్చిన సమాధానం "మాకు తెలియదు" అండ్ దట్ గర్ల్ సైడ్ " I THINK ITS IN ఆగష్టు OR SOME OTHER MONTH" మేము పనిలో వెళ్తున్నాం.. మమ్మల్ని డిస్టర్బ్ చేయద్దు.. మీ సోది ప్రోగ్రామ మీరును అని.. అని ఆ TV చానెల్ వాల్నే బెదిరించింది.. 
ఛి ఛి.. ఇంతకంటే సిగ్గు చేటు లేదు..
గురజాడ గారు అన్నట్టు.. "దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్.." 
 సో దేశం బాగుపడాలి అంటే ముందు ప్రజలు మారాలి..తరువాత నాయకులూ మారతారు.. 
అవినీతి నిర్మూలన కోసం అన్న హజారే లాంటి వ్యక్తులు చేసే పోరాటానికి నేను పూర్తిగా మద్దతు ఇస్తాను. దేశప్రగతికి నావంతు నేను చేసే బాధ్యతా ఇదే..
అంతకంటే ఏమి చేయలేని ఒక సామాన్య, మధ్యతరగతి మనిషిని నేను.. చేతాకని వ్యవస్థలో.. చేతకాని సామాన్యున్ని...
"తల్లి..!! భారతమాత...!!! క్షమించు అమ్మా... నీ బాగు కోసం ఏమి చేయలేని అభాగ్యున్ని..."
నాలాంటి అభాగ్యులు ఎదురుచూసే మార్పు ఎప్పుడు సంభవిస్తుంది.?
"పతితులార... బ్రష్టులార..బాధాసర్పధ్రష్టులార.. దగాపడిన తమ్ములార..ఏడవకండి ఏడవకండి..
జగనాద రథచక్రాలు వస్తున్నాయ్.. వస్తున్నాయ్.. రథచక్ర ప్రళయఘోషతో భూమార్గం పట్టిస్తాను.. భూకంపం పుట్టిస్తాను.. "
అన్నారు శ్రీశ్రీ.. ఎప్పుడు వస్తాయ్..? ఆ రథచక్రాలు మరి?

3 comments:

  1. అర్ధంకాలెదండి మధురవాణి గారు...మీ Expression...

    ReplyDelete
  2. హుమ్మ్.. అని ఒక పెద్ద నిట్టూర్పండీ.. మీ ఘోష విన్నాక ఏమనాలో తోచక అన్నమాట! :)

    ReplyDelete