Wednesday, April 6, 2011

నవరసాల్లో చావు గోల

రేయ్. అనుదీప్...! నీకొక మంచి టప రాసిపెట్టాలి అని డిసైడ్ అయ్యానురా.. - పాండు
ఏంటిరా... మందు కాని కొట్టావ లేక బ్రెయిన్ పని చేయటం స్టార్ట్ గాని చేసిందా.? టప రాస్తాను అంటున్నావ్... - అనుదీప్
ఏడ్చావ్ లే..! పింజారి మొకమోడ ..! నేను మందు తాగటం ఏంటి... ? నా బుర్ర ఎప్పుడు షార్ప్... పట్టుకొని చూడు చెయ్ తెగుద్ది... - పాండు
వద్దులేరా బాబు.. ఇప్పుడు నా చేయి కోసుకోలేను కాని.. ఎప్పుడు అయిన కూరగాయలు తరగటానికి కత్తి దొరక్కపోతే నీ తల వాడుతాను.. - అనుదీప్
ఏంటి వెటకారంనా? -- పాండు
కాదురా .. గొడ్డు కారం ... - అనుదీప్
సరే ఇంతకి ఏంటి ఆ టప పేరు? - అనుదీప్
" నవరసాల్లో చావు గోల ".. ఎలా ఉంది టైటిల్ ? -- పాండు.
"నవరసాల్లో చావు గోల" ఒరేయ్ అడివి మనిషి..! శుభమాంటూ ఏదో నేను బ్లాగ్ మొదలెడితే ఈ చావు గోల ఏంటిరా..? అక్కు పక్షి, నిరక్షర కుక్షి, అజ్హ్నాన కాక్షి... - అనుదీప్
టైటిల్ నే ఇలా ఉంటె.. ఇంకా విషయం ఎలా ఉంటది.. ఎందుకులేర బాబు LITE తీసుకో ఎందుకొచ్చిన గోల  - అనుదీప్
రేయ్.. రేయ్ అలా కాదురా .. మొత్తం నా యొక్క ఆలోచనల్ని రంగరించి ఒక కాన్సెప్ట్ అనుకున్న సో నువ్వు కాదనకూడదు.. ప్లీజ్ రా -- పాండు
సరే..!!  తగలడు.. ఎం చేస్తాం.. కర్మ అలా ఏడ్చింది నాది.- అనుదీప్
ఆ మాట మీద ఉండు.. పీక మీద బ్లేడ్ లా కోసుకుపోత, అరటి పండుని కోసినట్టు కోస్తా టప --- పాండు
 హే ఫ్రెండ్స్ ఎక్కువ ఉపోద్గాతం లేకుండా సీదా టప లోకి వెళ్లిపోదాం.. ఈ టప చదివితే నేను ఏంటో మీకే తెలుస్తుంది. " - పాండు
"""దేశ బాష లందు తెలుగు లెస్స అని ఏ ముహూర్తాన అన్నారో కానీ రాయలు వారు... నిజంగా నాకు అనిపిస్తుంది... తెలుగు బాష గద్య భాగానికి పద్య భాగానికి సరిగ్గా సరిపోతుంది. వాచకంలో తెలుగు బాష గొప్పధనమే వేరు.కొన్ని పదాల అమరిక బలే ఉంటుంది తెలుగులో.  తెలుగు భాషలో కొన్ని పదాలు వాడకం కేవలం మనకే సొంతం అని అనిపిస్తుంది. మచ్చుకి ఇప్పుడు మనం ఒక పదవాడకం తీసుకుందాం. అదే "చావు".

వీడేంటిరా బాబు.. తెలుగు, అది ఇది అంటాడు మళ్ళి చావు గురించి చెబుతాను అంటాడు ఏంటి అనుకుంటున్నారా...!! వస్తున్నా... అక్కడికే వస్తున్నా... చావు అనే పదాన్ని నాకు తెలిసి, తెలుగు లో ఉపయోగించినంతగా ఎక్కడ ఉపయోగించరేమో .. అని నా అభిప్రాయం.
అది ఏ రకమైన ఫీలింగ్ అయిన సరే....! విషాదం, ఆనందం, కోపం.... వగైరా...వగైరా...
నేను అనుకోవటం, నవరసాల్లో చావు అనే పదం బాగా వాడుకోవచ్చు అని.
విషాద సమయాన్నే తీసుకుందాం:  " చీ... చీ.... ఈ నరకం నా వల్ల కాదు. ఈ బాధ పడేకంటే ఇంత విషం మింగి చావటం నయం. " అని వింటుంటాం.. ప్రతి ఒక్క మనిషికి విషాద సమయాల్లో ఆకరికి వచ్చే పదం చావు నే..!
విషం మింగి చావటం లేదా ఇంకోవిధంగా చావాలని అనిపిస్తుంది... ఆత్మ్యహత్య. ఇవి అన్ని చివరికి వచ్చేది చావు కే...
ఆనంద సమయాల్లో కూడా మనం చావు ని వాడుకోకుండా ఏ వాఖ్యం పూర్తి చేయలేం అనిపిస్తుంది.
ఎవరు అయిన మంచి జోక్ చెప్పారు అనుకోండి... ఆ జోక్ పొట్ట చెక్కలు అయ్యేలా ఉంది అనుకోండి.. మనం ఏమి అంటాం.." రేయ్ ఆపరా బాబు.. నవ్వలేక చచ్చిపోతున్న..!! కడుపు చెక్కలు అయేలా ఉంది..."
ఈ బాగోద్వేకం లో కూడా మనం చావు లేకుండా పూర్తి చేయలేకపోయాం.
బాధలో ఉన్నాం అంటే అనుకోవచ్చు ఆనందం లో కూడా ఇదే...
ఏదైనా..! జరగరానిది జరిగింది అనుకోండి.. " చచ్చానురా. దేవుడా..!! ఇలా ఐపోయింది ఏంటి..? ఇప్పుడు ఎం చేయాలి..?" ఇక్కడ కూడా అదే చావు.
కోపంలో అయితే ఇంగ తిరుగే లేదు... చావు లేకుండా ఒక్క వాఖ్య కూడా చేయలేం అంటే నమ్మండి...
 ఉదాహరణకి : " రేయ్...వీర వంకరరెడ్డి చచ్చావుర నువ్వు...!! ఐపోయావ్ నా చేతిలో... అంతే... ఇగ..ఆకరిసారి ఇంటికి ఫోన్ చేసుకో..నువ్వు ఎలుకోనేదానితో కడసారి మాట్టాడుకో... నువ్వో...నేనో..తేల్చుకుందాం....ఏ సెంటర్ అయిన రెడీ.. ఎంత మంది అయిన తెచ్చుకో..సింగల్ గానే వస్తా...!!  ఎవడికి ఎంత దమ్ము ఉందో చూద్దాం. రేపు తెల్లారేసరికి   నీ శవం చూస్తా..! ఇది నా ఆన."
ఇది..ఎదో... ఫాక్షన్ సినిమాలో డైలాగ్ లా ఉంది కదా... మరి అంతే కదా... అంటే చావు గురించి చెబుతున్నాం... రౌద్రం లో కాస్త బలంగా ఉండాలి అని... కాపీ కొట్టేసాను...
కాదు కాదు కాపీ తో పాటు కొంచం టీ కూడా కలిపి కొట్టాను.
సినిమా డైలాగ్ అంటే గుర్తుకు వచ్చింది అండి. మన సినిమాల్లో ఈ చావు మీద డైలాగ్లు అని BUMPER హిట్. రవితేజ విక్రమార్కుడు సినిమానే తీసుకోండి, " చావు అంటే బయపడటానికి అల్లాటప్ప గల్లి రౌడీని కాదుర... రాథోడ్..  విక్రం రాథోడ్. భయం నాకు కాదుర..! చావుకి.. అందుకే పిచ్చికుక్కలా నా వెనకాలే తిరుగుతుంది.." ఊహూ.. ఈ డైలాగ్ వినగానే ఒకటే ఈలలు, కేకలు ధియేటర్లో.. 
ఇంకొక సినిమాలో మన బాలయ్య బాబు... డైలాగ్ ఏంటి.. ఆహ ఏంటి అసలు.. మనందరి ఫేవరేట్ " కత్తితో కాదురా..! కంటి చూపుతో చంపేస్తా.." మోస్ట్ పవర్ ఫుల్ డైలాగ్ ఇది..
సినిమాల్లో ఆవేశం కట్టలు తెంచుకున్న హీరో, చంపేది విలన్నే.....!!
నవరసాల్లో భీబత్సం మరియు భయానకం లో కూడా చావు దే కీలక పాత్ర...
ధక్షయజ్ఞంలో వీరభద్రుడు నానా భీభత్సం చేసాడు అంటారు..  ఇంతకి ఏంటా... భీబత్సం... ధక్షరాజు సేనల్ని అందరిని చంపటమే.
ఈ లోకంలో.... చావు కి బయపడని వాడు లేడు, అంటే అతిశయోక్తి కాదు ఏమో .. !
సో ఈ రెండు రసాలలో కూడా చావు యొక్క ప్రాముక్యత అవగతం అయినది కదా...
 ఇంగ మనకి మిగిలినవి .. శృంగారం, ఆశ్చర్యం, సహనం...
శృంగారం..  : నెచ్చెలి విసిరే వాలు చాపు తగిలితే చాలు ... చచ్చారే కుర్రకారు...  అందుకేనేమో... ఓ సినిమాలో "చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరె హాయ్..." అని పాట పెట్టారు... అమ్మాయిలు చూసే కొంటె  చూపు వామ్మో తట్టుకోవటం చాలా కష్టం అని అనిపిస్తుంది... అమ్మాయిలు ఒక నవ్వుతో కరుణిస్తే చాలు ఈ క్షణమే చచ్చిపోతం  అనే పిల్లకాయలు ఎంత మంది లేరు చెప్పండి.. శృంగారంకి ఇంకొకరకం గా చెప్పే కామం వల్ల ఎన్ని అనర్ధాలు జరిగాయ్... పెద్ద పెద్ద యుద్ధాలు జరిగి... ఎంతో మంది చచ్చారు... """"
ఇదే నేను చెప్పదలుచుకున్న చావు గోల... నవరసాలు అండ్ చావు ప్రాముక్యత... తెలుగులో చావు ఎంతగా అమరిపోయిందో చూసారుగా..
మిత్రులు అందరికి నా యొక్క ఈ చావు పురాణం  బాగా అవగతం అయినది అనుకుంట... మరి ఇక సెలవ పుచ్చుకుంట నేను టపా నుంచి..
                              ====  X ====
రేయ్ పింజారి..!! మరి మిగతా రెండు ఎందుకు వదిలేసావ్  - అనుదీప్
 ఏవి ? -- పాండు
అవేరా..! సహనం ఇంకా ఆశ్చర్యం -  అనుదీప్
ఏమోరా..! నాకు ఇంతవరకే వచ్చు అంతవరకే రాసాను..నీకు తెలిస్తే నువ్వు రాసుకో.. ఇలా అన్ని అడిగితే కష్టం నాన్నా..  BYE మరి -- పాండు.
ఓసి నీ అఘాయిత్యం కూల.. నేను ఎక్కడి నుంచి రాయను.. కాన్సెప్ట్ నీది కాబట్టి నువ్వే చూడాలి నాకు ఎలా తెలుస్తుంది.. - అనుదీప్
ఫ్రెండ్స్, చూసారుగా..!! మన పాండు గాడు ఎలా వదిలేసాడో, సో మీలో ఎవరికీ అయిన చావు ని ఆశ్చర్యం ఇంకా సహనం లో ఎలా వ్యక్తపరచాలో తెలిస్తే మా పాండు గాడికి చెప్పగలరు అని మనవి. సరే మిత్రులారా సెలవు తీసుకుంటా ఇగ.. - అనుదీప్
"ఈ పాండు గాడిని ఇరగ తన్నాలి..ఇంకొకసారి టపా అంటే చంపుత వాడిని .." - అనుదీప్

4 comments:

  1. baagundandi mee chaavu puraanam diff thought expressed in gd way

    ReplyDelete
  2. Thanks Andi Madhura vaani gaaru,

    @Rasaghna,

    Mee spandanaki dhanyavaadhalu andi...

    ReplyDelete
  3. పింజారీ అంటే పింజలు జంద్యాలు వడికేవాడు http://nrahamthulla.blogspot.in/2013/07/blog-post.html

    ReplyDelete