Tuesday, March 8, 2011

ప్రవళిక

ఉదయం 9 గంటలు. భానుడి వెలుగుకి నిదుర కళ్ళతో లేచి సమయం చూసుకుంది ప్రవళిక.  
" అయ్య బాబోయ్...!!!! బారెడు పొద్దు ఎక్కింది. ఇంకా ఎమన్నా ఉందా..!! ఆఫీసుకి లేట్ గా వెళ్తే మేనేజర్ తోలు తీస్తాడు"

అనుకుందే తడవుగా హడావిడి గా లేచి వాశ్రూం లోకి పరుగు లంగించుకుంది. బ్రష్ నోట్లో పెట్టుకొని అద్దం లోకి చూస్తూ రాత్రి జరిగిన గొడవ గురించి ఆలోచిస్తుంది. కట్ చేస్తే,
" నాన్న..! అతని పేరు పార్థు. నాతో పటు పనిచేస్తారు. మేము ఇద్దరం జాబులో జాయిన్ అయిన దెగ్గర నుంచి తెలుసు. బాగా  పరిచయం అది కాస్త ప్రేమ గా మారింది. పెళ్ళంటూ చేసుకుంటే పార్థునే చేసుకుంటా." అని కరాకండిగా చెప్పింది వాళ్ళ నాన్న రంగారావు గారికి మళ్ళి...
"అమ్మాయ్..!! నేను నీకు చాలా సార్లు చెప్పాను. నాకు అతను అంటే ఇష్టం లేదు." - రంగారావు.
"నన్ను బాగా చూసుకుంటాడు  నాన్న..! మిమ్మల్ని చాలా గౌరవిస్తాడు. " - ప్రవళిక
"ఒకసారి చెపితే అర్ధం కాదా.? ఈ టాపిక్ మన ఇంట్లో నడవబట్టి నెల అవుతుంది. ఎలా చెబితే నీ బుర్ర కి ఎక్కుతుంది..? ఎందుకు మీరు పెద్దోళ్ళ మాట వినరు. ప్రేమ కి ఇద్దరు సరిపోతారు ఏమో..!! బట్ పెళ్లి కి రెండు కుటుంభాలు కావాలి" - రంగారావు గారు.
"అసలు నీ మొఖం చూసుకున్నవా.? ఎలా ఉందో చూడు నిదుర లేక..నీకు నిదుర లేదు, మాకు నిదుర లేదు.. ఎందుకు ఇంత మొండి గా చేస్తున్నావ్..? నిన్న నీ రూం లో చెక్ చేస్తే అమ్మకి స్లీపింగ్ పిల్ల్స్ దొరియాయి అంట. అసలు ఏమి అయిపోతున్నావురా నువ్వు? మా మంచి అమ్మ కదా..!! మాట విను అమ్మ..! ప్లీజ్.. వొద్దు. ఆ పిలగాడి వాళ్ళ ఫ్యామిలీ మంచిది కాదు అంట. " - రంగారావు గారు.
" నాన్న.!! మీరు నా మాట వినరే.. మీరే మొండి గా చేస్తున్నారు.. మా ప్రేమ అర్ధం చేసుకోవటం లేదు.  మన ఇంట్లో ఈ విషయం తెలిసినప్పటి నుంచి మీరు సరిగా మాట్లాడటం లేదు నాతో.  అన్ని అమ్మే చుస్కుంటుంది. నేను అంత పరాయి అయిపోయాన? చెప్పండి నాన్న.?" - ప్రవళిక
"ఆఫీసు వర్క్ టెన్షన్ తో నేను చాలా సతమతమవుతున్న  ఆపైన ఇంటికి రాంగానే ఈ నస.. చచ్చిపోవాలని  అనిపిస్తుంది. " - ప్రవళిక

"ఒకటి మాత్రం నిజం నాన్న..! పార్ధుకి  నేను అంటే ప్రాణం.. అయిన పెళ్లి అయాక ఇద్దరం కలిసి వేరే ఉంటాం. మేము ఢిల్లీ లో సెటిల్ అవుదామని అనుకుంటున్నాం." - ప్రవళిక

"మీరు ఇలా ఎన్ని రోజులు నాతో arguement చేసిన ప్రయోజనం ఉండదు. అల కాదు అని బలవంత పెడితే నా శవాన్ని చూస్తారు. " - ప్రవళిక
" నీకు ఎందుకు అమ్మ అంత కష్టం .? నువ్వే మంచిగా ఉండు మేమే ఇంత విషం తాగి చస్తాం. నిన్ను కన్న పాపానికి మేమే పోతాం. మీరు రండి భోజనం చేద్దురు గాని " కళ్ళ తుడుచుకుంటూ వంటగదికి వెళ్లిపోయింది రంగారావు గారి భార్య వాణి. 
" నాకు ఏమి వొద్దు వాణి.! చాలు... నా కూతురు నాకు కడుపు నింపింది" - రంగారావు గారు.
వాణి కూడా రంగారావు గారిని అనుసరించింది. ఇంగ అక్కడ ఒక్కతే మిగిలిపోయింది ప్రవళిక.  అలా... వేదన తో నిండుకున్న మనసుతో.. నీళ్ళతో నిండుకున్న కళ్ళతో... బెడ్రూం కి తను కూడా ఏమి తినకుండా పరుగు తీసింది.
           ఆఫీసు లంచ్ టైం లో కూడా, పార్ధు ఎంత ఫొర్స్ చేసిన తినలేదు తను.
 అద్దంలో తన్ని తాను చూస్తు మళ్ళి అనుకున్నది. " అప్పట్లో ఎంత అందం గా ఉండేదాన్ని . ముఘ్ద  మనోహర రూపం అనేవారు ఇంట్లో వాళ్ళు అంతా.. అందుకే అంత వెంట పడ్డాడు పార్ధు. బాపు బొమ్మరా ..! నువ్వు అనేవాడు. నేను వొద్దు అని ఎంత వారించిన వినలేదు. అంత అందమయిన  అమ్మాయ్... ఏంటి ఇలా అయిపోయింది. డార్క్ CIRCLES , మొటిమలు, పాలిపోయిన మొఖం, తనేన ప్రవళిక..?  
పేరెంట్స్నా ? లేక పార్ధునా? ఎవరు ముఖ్యం నాకు...? ఎందుకు నా మాట వినటం లేదు ? నేను ఎప్పుడు ఏది అడిగిన తీసుకు వచ్చే నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారు? అడగకముందే అని తెచ్చే నాన్ననేన?  ఇలా మాట్లాడేది... ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? నేను ఎం తప్పు చేశాను? ప్రేమించటం తప్పా..? ఇది మిలియన్ డాలర్ ప్రశ్న..WHY THIS IS HAPPENING TO ME? దేవుడా ప్లీజ్ కరుణించు...!"
బెడ్ మీద పడుకొని నిదుర రావటానికి, ఈ టెన్షన్ నుంచి నిదుర పోవటానికి స్లీపింగ్ పిల్ల్స్ తీసుకుంది. ఎంతో ఒత్తిడి, సరి అయిన తిండి లేదు, ఏమి లేదు. 
            అలా నెల నుంచి తను,తనలా..లేదు. ఆలోచిస్తూ పడుకుండి పోయింది. 
వాశ్రూం నుంచి బయటకి వచ్చి ఎదావిధిగా "మమ్మీ.." అంటూ పిలిచింది ప్రవళిక. ఎటువంటి స్పందన లేదు అమ్మ దగ్గరి నుంచి.
"నాన్న..!!" మళ్ళి పిలుపు.. లేదు ఛాన్స్ నే లేదు.
రోజు రాత్రి  ఎంత గొడవ అవుతున్నా... నాన్న..అమ్మతో మళ్ళి పొద్దున breakfast చేసే వెళ్తుంది ఆఫీసుకి తను. 
సరిగా తినటం లేదు. నిన్న రోజంతా ఏమి తినలేదు, ఆఖలిగా ఉండటంతో టిఫిన్ చేద్దాము అని ఎంత పిలిచినా ఎవరు రావటం పలకటం లేదు. 
ఇంతలో రంగారావు గారు హాల్ లోకి వచ్చారు.
" వాణి..!! కాఫీ తీసుకురా. అని చెప్పి ఈనాడు తిరగేస్తున్నారు.
హాల్ లోకి అప్పుడే వచ్చిన రంగారావు గారిని నాన్న..! నాన్న అని పిలుస్తుంది. రంగారావు గారు అసలు పలకటం లేదు. 
" రాత్రి జరిగిన దానికి నాన్న.. నాతో పూర్తిగా మాట్లాడటం ఆపేసారా ఏంటి.  అయ్యే ఉంటుంది... రాత్రి మొదటి సారిగా నాన్న కళ్ళలో నీళ్ళు చూసాను. అమాంతం నాన్నని పట్టుకొని ఏడవాలి అని ఉంది కాని, నాన్న కనీసం విన్నా.. విననట్టే ఉంటున్నారు. అంత శత్రువుని అయిపోయాను." 
" ఈ లవ్ చేసిన వాళ్లకి ఏంటి ఈ పరీక్ష? "
సరే..!! అమ్మని పిలుద్దాం అని పిలించింది.. హాల్ గుండా వంట గది కి వెళ్తున్న ఆమె కూడా నో రిప్లై. 
" వాణి.. అమ్మాయిని పిలువు ఎన్ని సార్లు చెప్పాలి నీకు? వెళ్ళు నీ వంట ఎప్పుడు ఉండేదే గాని పో వెళ్ళు... రాత్రి అది కూడా ఏమి తినలేదు..." - రంగారావు గారు.

" అబ్బ పిలుస్తాను ఉండండి మీరును. " - వాణి 
" అది కాదు వాణీ... ఒకసారి ఇలా రా..!! రాత్రి నిదుర పట్టక నేను బాగా ఆలోచించాను... తనే కరెక్ట్ నేమో..!! ఒప్పుకున్ధామా.. మరి? నువ్వు ఏమంటావ్? " - రంగారావు గారు. 

" అమ్మ.. నాన్న..!! ఏంటి మీరు పిలుస్తుంటే పలకరు..? ఇంగ చాలు ఆపండి ప్లీజ్.. మాట్లాడండి నాతో.." - ప్రవళిక

" ఏమో అండి..!! అది అంత పట్టుదలగా ఉంది కదా...నేనూ మాట్లాడను ఆ అభ్భాయ్ తో... పిలగాడు మంచివాడే... ఇంగా వాళ్ళ ఫ్యామిలీ అంటారా...! తను ఎలాగా ఢిల్లీ లో సెటిల్ అవుతాం.. అంటుంది కదా..సో ఒప్పుకోండి.. మరి మీరు.." - వాణి

" సరే వెళ్లి పిలువు తనని.." - రంగారావు గారు.

" సరే వంట గదిలో పాలు దించి తన బెడ్రూం కి వెళ్తాను.." - వాణి

ఇంగ లాభం లేదు ఏదో ఒకటి తెల్చేద్దాం.. అని తన బెడ్రూం నుంచి బయటకి వచ్చింది. హాల్ లో ఉన్న తన తండ్రి దెగ్గరికి వచ్చి "డాడి.. ప్లీజ్ " అని గట్టిగ అరిచింది ఈ సారి కూడా ... నో రిప్లై...

"చాలు నాన్న...!! ఇంగ చాలు ఆపండి.. ప్లీజ్.. " - మోకాళ్ళ మీద ఆయన ముందు వాలిపోయి పిలిచింది  ఈ సారి... అస్సలు ఉలుకు పలుకు లేదు రంగారావు గారి దగ్గర , అసలు తను ఆయన ఎదురుగ లేనట్టే బెహేవ్ చేస్తున్నారు.
"అబ్బా...!!!!!!!!! సరే మీరు చెప్పినట్టే వింటాను నాన్న..!  ప్లీజ్.. నాతో మాట్లాడండి నాన్న..!!" దుఖ్ఖం తన్నుకొని వచ్చి ఏడుస్తూనే ఉంది. 

ఇంతలో ఏమండి...!! అని ఒక పెద్ద కేక వాణి దగ్గరి నుంచి... రంగారావు, చదువుతున్న పేపర్ అక్కడనే పడేసి అరుపు వినిపించిన వైపుకి పరుగెత్తారు.. 

"అయ్యో....!!! "అని ఆయన ఏడవటం స్టార్ట్ చేసారు..హాల్ లో కూర్చొని ఏడుస్తున్న ప్రవళికకి ఏమి అర్ధం కావటం లేదు.. ఏంటా అని తనూ, కంగారు గా పరుగు తీసింది అటు వైపు... అది తన బెడ్రూం నే..!!
అటు వైపు నుంచే.. ఆ రోదనలు..

బెడ్రూం దెగ్గరికి వెళ్లి, లోపల చుసిన తనకి పెద్ద షాక్ .. తన కళ్ళను తానె నమ్మలేకపోయింది.. 
 తన ఎదురుగా....
" బెడ్ మీద ప్రవళిక స్పృహ లేకుండా పడి ఉంది..."

 - ఫ్రెండ్స్..!! ఇక్కడ ప్రవళిక అండ్ రంగారావు గారు ఇద్దరు, చివరికి ఒకరికోసం ఒకరు ఒప్పుకునే పరిస్థితి వచ్చింది కాని అప్పటికే  జరగవలసిన అనర్ధం జరిగిపోయింది.  తప్పు ఎవరిది అంటారు?

Tuesday, February 1, 2011

అణుయుద్ధం

"అణుయుద్ధం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న పదం. అత్యంత శక్తివంతం ఐన America నుంచి... అల్పమైన zimbambwe వరకు ప్రతి ఒక్కరిని బయకంపితులని  చేస్తున్నది......."
         ఒకరోజు నేను ఆఫీసు లో తీరిక లేకుండా టైం ని ఎలా వేస్ట్ చేయలా అని ఆలోచిస్తున్న టైం లో నాకు ఒక మెయిల్ వచ్చింది... నా స్నేహితుడి దెగ్గర నుంచి... మనం బిజీగా ఉండటం వల్ల దాన్ని మల్లి చదవచ్చులే అని, పర్సనల్ ఫోల్డర్ లో పెట్టాను. మీరు పప్పులో కాలు వేయకముందే చెప్పేస్తాను లెండి...మా మేనేజర్ పక్కనే ఉండటం వల్ల, అప్పుడు చదవకుండా వాడు లేనపుడు చూద్దాంలే అని... మూవ్ చేశాను. అది సంగతి...!!   
        సమయం: సాయంత్రం 5 గంటలు , మా చెండశాసనుడు వెళ్లి పోయాక మా కొలీగ్ పంపిన మెయిల్ ఓపెన్ చేశాను.  ఆ మెయిల్ చదవమని వాడు ఒకటే నస. నాకు తప్పలేదు ఇగ. చదువుతూ పోతుంటే ఒకటే నవ్వు నాకు .. పొట్ట చెక్కలు అయ్యేలా..... ... కట్ చేస్తే ప్రెసెంట్ టైం ...మొదటి టప రాసేశాం... రెండవ టప రాయాలని ఒకటే ఆలోచిస్తుంటే ..!! అపుడు గుర్తుకు వచ్చింది నేను చదివిన ఆ మెయిల్ గురించి... సో అనుకున్న ఇగ..!  ఆ మెయిల్ నే ఒక టపాల రాసుకొని నా బ్లాగ్ లో స్టోర్ చేసుకుందాం అని... ఎవరో రాసారో ఈ షార్ట్ స్టొరీ కాని... బలే గా ఉంది అండి.... సరిగ్గా రాసారు... వాళ్ళు ఎవరు ఐన వాళ్ళకి నేను అంతగా నవ్వేల చేసినందుకు కృతజ్ఞతలు... సరే మనం ఇంగ టప మొదలెడదాం.... ..
                  " రేయ్.... అనుదీప్...అనుదీప్... " 
                  ఎవడ్రా అది టప రాద్దాం అనుకుంటే ఒకటే కేకలు వేస్తున్నాడు.. వెనక్కి తిరిగి చూస్తే  ఇంకెవరు....ది గ్రేట్ పాండు....హాఊ.. హాఊ.. హాఊ...!!
             నేను- "ఏంట్రా..."
             పాండు- " ఏంటిరా..? ఏం పీకిన్గ్స్.."
              నేను- " రెండవ టప రాస్తున్నారా....!!... అదే నేను 6 నెలల క్రితం వేణు పంపిన మెయిల్ ఉంది కదరా.. అది తెలుగు లో తర్జుమా చేసి నా బ్లాగ్ లో పెట్టుకుందాం ఎప్పటికి...అని... నాకు బాగా  నచ్చిందిరా.. ఆ మెయిల్ .. నీకు ఫార్వార్డ్ చేశాను కదా... అదేరా అణుయుద్ధం గురించి... అది..."
             పాండు- " ఓసదా.. గుర్హ్టు వచ్చింది..హా బాగుందిరా... నేను కూడా మస్తు నవ్వుకున్నాలే తీయ్.. 
                           రేయ్... రేయ్... నేను రాస్తానురా ఇది... నాకు ఆ భాగ్యం ఇవ్వు.. ప్లీజ్.." 
              నేను-   " ఏంటి నువ్వా...? మతి గాని పోయింది ఏంటిరా?... నీకు లవలేశమంతఐన జ్ఞానం లేదు నువ్వు ఎం రాస్తావ్... చల్ దోబ్బెయ్...."
             పాండు- " రేయ్.. అది కాదురా.. జస్ట్ తర్జుమానే కదా... నాకు వదిలేయ్... బాన్చాత్... నేను చూసుకుంటాను.."
              నేను-  " నువ్వు...తర్జుమా?   నా బొంద బాన్చాత్...తాజ్ మహల్ గురించి చెప్పరా అంటే కాస్త కామెడీగా ఎం చెప్పవో గుర్తు ఉందా నువ్వు లాస్ట్ టైం .?"
             పాండు- " ఓ ఎందుకు గుర్తు లేదు...కావాలి అంటే మల్లి చెపుతాను విను.. ` తాజ్ మహల్ చిత్రపటం కెళ్ళి చూపిస్తూ.. `   అదే చారిత్రాత్మక తాజ్ మహల్ కట్టడము... క్రి.శ. 1957 లో తాజ్ మహల్ టీ పొడి కంపనీ వాళ్ళు పుబ్లిసిటీ కోసం దాన్ని కట్టించారు....   అప్పుడు నువ్వు కూడా అన్నావ్ కదరా.. నన్ను పొగుడుతూ.. "రేయ్.. పాండు... చీకటి నిండిన నా జీవితంలో వేయి సిగరెట్ ల వెలుగు వెలిగించి నావు ".. అని..
              నేను-  చేసావులే పిడక... ఎదవ పింజారి పేస్ నువ్వును... ఇది నా బ్లాగ్.. నేను ఒప్పుకోను నువ్వు రాయటానికి...
              పాండు- రేయ్ అది కాదు రా ... ప్లీజ్.. బ్లాగ్ స్టార్ట్ చేసేటపుడు నాది వాటా ఉంది అని ప్రామిస్ చేసావ్ ప్లీజ్ రా..! నాకు అవకాశం ఇవ్వు ప్లీజ్...
              నేను-- సరే తగలడు.. ఎం చేస్తాం కర్మ...మాట ఇట్చన్ కదా కానివ్వు... ఓకే..!మిత్రులారా.. జర ఇనుండ్రి...
              పాండు-- థాంక్స్ రా...    సబకి నమస్కారం... 
              నేను- సబ ఏంటిరా ?పింగళి వెంగలప్ప... ఇది బ్లాగ్.. ఇక్కడ రాయటమే ఉంటది... సొల్లు స్పీచ్ కాదు..
              పాండు- " ఓ సారీ ! అందరికి మంగిడీలు.. పరిచయం అవసరం లేని వ్యక్తిని నేను .. ఆల్రెడీ నా గురించి మొదటి టప లో ఉంది.. సో డైరెక్ట్ ఎటాక్ ఇగ..
                            అప్పుడు ప్రపంచం అంత ఒకరంటే ఒకరు ద్వేషంతో... పగతో బ్రతుకుతున్న రోజులు..అసూయ, అస్ప్రుహ తప్ప ప్రేమ, స్నేహం అనే పదాలకి అర్ధం లేదు.. అలాంటి రోజుల్లో ... అలా దేశాలు ఉన్నపుడు మొదటగా వచ్చే పేర్లు... AMERICA అండ్ RUSSIA ...
                            ఒకవేళ అమెరికా తన అణుఆయుదాన్ని...రష్యా మీదకి లాంచ్ చేస్తే ... శాటిలైట్ టెక్నాలజీ తో ఆ విషయాన్నీ ముందుగానే పసిగట్టి అమెరికా ఎత్తుకి పై ఎత్తు వేసి కౌంటర్ ఎటాక్ చేస్తుంది... ఇది వాళ్ళ ఇదరి మధ్య ఉన్న సంగతి... ఇలాంటి పరిస్థితే అస్మదీయులు, తస్మదీయులు ఆయన హిందుస్తాన్ అండ్ పాకిస్తాన్ మధ్యలో ఎలా ఉంటుందో చూద్దాం...
                           పాకిస్తాన్ ఆర్మీ ఎలాగ ఐన న్యూక్లియర్ మిస్సైల్ ని లాంచ్ చేయాలి అని డిసైడ్ అవుతది... దీనికి వారికి ఎలాగో పాకిస్తాన్ GOVT పర్మిషన్ తో పని లేదు కనుక కౌంట్ డౌన్ స్టార్ట్ చేయమని ఆర్మీ చీఫ్ ఆర్డర్ పాస్ చేస్తాడు... మన ఇండియాధీ  చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ... వాళ్ళు కౌంట్ డౌన్  స్టార్ట్ చేయాలి అని అనుకునే దానికి 8 సెకన్ల ముందే తెలిసిపోతుంది... --అది ఎలాగా అని ప్లీజ్ అడగద్దు....
 ఇండియన్ ఆర్మీ కౌంటర్ ఎటాక్ గా తన మిస్సైల్ లాంచ్ చేయాలని అనుకుంటుంది... ఎమ్మటే ప్రెసిడెంట్ అఫ్ ఇండియా కి పర్మిషన్ కోసం ఆర్జీ పెడుతుంది.. ప్రెసిడెంట్, ఆమోదం కోసం మంత్రిమండలి కి పంపిస్తారు..
ప్రధానమంత్రి ... అన్ని పార్టీల అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని ఒక్క ముక్క లో EMERGENCY గా వివరించి సభ ఆమోదం కోసం జీఓ 777 ని ప్రవేశ పెడతారు  .. కుంభకోణం గురించి మాట్లాడుతారు అనుకోని ముందుగా తయరు చేసిన పేపర్ వర్క్ తో లోఖ్ సభ కు వచ్చిన ప్రతిపక్షాలు,మిత్ర పక్షాలు విస్తుపోయి ... ముందు ప్రేపరేషన్ లేని టాపిక్ అవ్వటం వల్ల, ఎం మాట్లాడాలో అర్ధంకాక... ఈ  జీవో ని నిరసిస్తూ,ఖండిస్తూ, పోడియం వధకు దూసుకు పోయి రచ్చ, రచ్చ చేస్తే.. ఎం చేయాలో అర్ధం కాని స్పీకర్, సభని 5 నిముషాలు వాయిదా వేస్తారు ... 5 నిమిషాల్లో కూడా ఏమి ప్రిపర్ కాని అన్ని పక్షాలు, సభ నుంచి  వాక్ అవుట్  చేస్తాయి..     
                       ఇది అంత ఆల్-బాజీర చానల్ లో లైవ్  చూస్తున్న పాకిశ్తాన్ ఆర్మీ తనలో తాను నవ్వుకుంటు, మిస్సైల్ లాంచ్ చేయటానికి ట్రై చేస్తుంది.. టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ లాంచ్ ఆగిపోతుంది ఐన తన తదుపరి ఎటాక్ కోసం ఆ బగ్ ఫిక్స్ చేసే ప్రయత్నా లో మునిగిపోతుంది..  ఈలోపు రూలింగ్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్న మైనారిటీ పార్టీలు తమ సపోర్ట్ ని, ఉపసంహరించుకున్టై ... ఇదే అదనుగా  ప్రతిపక్షాలు కుంభ కోణాలు అవి ఇవి అని మీడియాతో చేతులు కలిపి  SITUATION ని DEVIATE చేసి GOVT పడిపోయేలా చేస్తాయి.. బల పరీక్షా లో నిరుపిన్చుకోలేకపోయన రులింగ్ పార్టీ మళ్లీ ఎన్నికలకు తెర దించుతుంది.. ఇక తప్పక రంగం లోకి దిగిన ప్రసిడెంట్, ఎన్నికలకు టైం లేదని , తాత్కాలిక ప్రభుత్వాని ఏర్పాటు చేసి పరిస్థితి అదుపులో వచ్చేలా చేయమని ఆదేశిస్తారు.. 
                    ఆ విధంగా.. ఏర్పాటు ఐన తాత్కాలిక ప్రభుత్వం.. న్యుక్లీయర్ మిస్సిల్ లాంచ్ కి ఆమోద ముద్ర వేస్తుంది... ఇది తెలిసిన ఎలక్షన్ కమీషన్, మిస్సైల్ లాంచ్ ని తక్షణమే ఆపి వేయాలని ఆదేశిస్తుంది.. ఎందుకు అంటే తాత్కాలిక ప్రభుత్వానికి ఆ అధికారం లేదు అని..  దీనితో ప్రభుత్వం సుప్రీం కోర్ట్ లో ఆర్జీ పెట్టుకుంటుంది..  అప్పుడు సుప్రీం కోర్ట్ రంగం లోకి దిగి , ఈ అత్యవసర పరిస్థితిలో ఈ ప్రభుత్వానికి నిర్ణయం తీసుకనే అధికారం  ఉంది అని తీర్పు ఇచ్చి.  ఎలక్షన్ కమీషన్ కి అక్షింతలు వేస్తుంది.. ఇది అంత ఆల్-బాజీర ఛానల్ లో చూస్తున్న పాకిస్తాన్ ఈ సరి మిస్సైల్ ని సక్సెస్ ఫుల్ గా TAKEOFF చేస్తుందిగాని.. గమ్య నిర్ధారణ లో పొరపాటు వల్ల తన దేశ రక్షణ శాక కార్యాలయం మీదనే ఉదయం 11 గంటలకు పడి పూర్తిగా ద్వంసం అవుతుంది.. లక్కీ గా  ఆ రోజు అంత త్వరగా ఎవరు రాకపోవటం వల్ల ఆస్తి నష్టం తప్ప ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా తప్పించుకుంటుంది... ఇలా జరిగినా  మళ్లీ తన నెక్స్ట్ మిస్సైల్ లాంచ్ కి ఏర్పాట్లు మొదలు పెడుతుంది..  ఈసారి USA , CHINA నుంచి బెటర్ టెక్నాలజీ ని ట్రై చేయటానికి ప్రయత్నిస్తుంది... 
                యుద్ధ నిర్ణయాధికారం వచ్చిన కొత్త ప్రభుత్వం జీఓ  777 పాస్ చేయాలని, అన్ని పార్టీ ల మీటింగ్ కి ఏర్పాట్లు చేసి మీటింగ్ కి ముందు.. తెలివిగా లగాన్ అండ్ చక్ దే ఇండియా సినిమాలు చూపించి, వాళ్ళలో దేశ భక్తి ని ప్రోది గొల్పి. ఆమోద ముద్ర వేయిన్చుకుంటుంది.. ఆ విధంగా ౩ నెలల నిరీక్షణ అనంతరం లభించిన పర్మిషన్ తో ఇండియన్ ఆర్మీ న్యూక్లియర్ మిస్సైల్ లాంచ్ కి సన్నాహాలు స్టార్ట్ చేస్తుంది... ఇది తెలిసన మానవ హక్కుల సంఘం , అణు ఆయుధ వ్యతిరేక సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకం గా నినాదాలు చేస్తూ.రాస్తా రోకో లు చేయటం, PM దిష్టి బొమ్మను దగ్ధం చేయటం లాంటివి కానిచ్చి , భారత్ బంద్ ప్రకటిస్తాయ్. అంతే కాకుండా వాషింగ్టన్ , కాలిఫోర్నియా లో ఉన్న వేలాది ఇండియన్స్ కి  ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఆమోద యోగ్యం కాని ఈ చర్య గురించి, ఈ మెయిల్స్ కుప్పలు తెప్పలు గా పోతాయి. సో కథ మళ్లీ మొదటికి వెళ్లి  మిస్సైల్ లాంచ్ ఆగిపోతుంది. 
              ఇగ ఒకసారి పాకిస్తాన్ విషయానికి వస్తే , ఒకేసారి అమెరియా అండ్ చైనా టెక్నాలజీ యూస్ చేయటం వల్ల మిస్సైల్ లో మాల్ ఫన్షనింగ్ జరిగి, మిస్సైల్ రాజస్తాన్, మధ్య ప్రదేశ్, ఒరిస్సా, బీహార్ లను ధాటి బంగాళఖాతం లో పడి వేలాది చేపలని చంపుతాయి... ఆ విధం గా సముద్ర జాలర్లకి శ్రమ తగ్గిస్తాయి...  అమెరికా అండ్ చైనా టెక్నాలజీ ఒకేసారి యూస్ చేయటం వల్ల ఫెయిల్ అయింది అని భావించి , ఈసారి ఏకం గా USA మిస్సైల్ నే స్మగల్ చేసి ఆపరేట్ చేయటానికి ట్రై చేస్తారు.. అమెరికా సాఫ్ట్ వేర్ అర్ధం కాక , ఏమి మార్పులు చేయకుండా లాంచ్ చేస్తారు.. అది వెళ్లి తన ఒరిజినల్ టార్గెట్ ఐన రష్యా తీరం వైపు దూసుకుపోతుంది..  రష్యా కౌంటర్ ఎటాక్ తో ఆ మిస్సైల్ కి చెక్ పెట్టి ఆ పైన ఇంకొక మిస్సైల్ లాంచ్ చేస్తుంది.  సక్సెస్ ఫుల్ గా .... దానితో ఇస్లామాబాద్ దెబ్బకి డా.. !!               
ఇస్లామాబాద్ ని కోల్పోయిన పాకిస్తాన్ సహాయం కోసం ప్రపంచ దేశాలని ఆశ్ర ఇస్తుంది... ఇండియా తన ప్రగాడ సానుభూతి తెలుపుతూ.. వాళ్ళ కోసం కొన్ని లక్షల్లో PARLE - G బిస్కెట్ లు పంపింది. 

ఫైనల్ గా  విషయం ఏంటి అంటే...

            " ఇండియాకి  ఎప్పటికి మిస్సైల్ ని లాంచ్ చేసే చాన్సు రాదు..
               పాకిస్తాన్ ఎప్పటికి సక్సెస్ ఫుల్ గా మిస్సైల్ ఆపరేట్ చేయలేదు....."               

Tuesday, January 25, 2011

అవిక్రపరాక్రమ, గండబేరుండ పాండు....! హాఊ.... హాఊ.... హాఊ...!!!!!

ముందుగా అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.....

Yello ఫ్రెండ్స్....

                     "YELLO ".... ఇదేంటి ఇలా పలకరింపు అనుకుంటున్నారా..? కరెక్ట్ నే అండి టైపింగ్ మిస్టేక్ కాదు. అది ఎలాగా అంటే.. నేను ఉండేది వెస్ట్ ఆఫ్రికా లో. ఇక్కడ Hello కి బదులుగా Yello అని సంభోదిస్తారు.  మనం బొంబాయి ని ముంబై లాగా... అబ్బా.. లాజిక్ కోసం వెతకొద్దు ప్లీజ్.... OK అది విషయం..

                      నా గురించి కాస్త వివరణ అండి... తప్పదు మరి.. బ్లాగ్ నాది కదా... అందుకే....

 నా పేరు అనుదీప్.. నేను ఈ మధ్య తెలుగు బ్లాగ్స్ బాగా ఫాలో అవుతున్నాను.  అందరు తమ అభిప్రాయలు, అభిరుచులు, ముచ్చట్లు, వగైరా...వగైరా...  బలే గా రాస్తున్నారు. వారు వ్యక్తపరిచే విధానం, ఆ హాస్యచతురత నన్ను బాగా ఆకట్టుకున్నాయ్. ఇంగ అప్పుడు మనం ఫిక్స్ అయ్యాం... నేను ఒక బ్లాగ్ స్టార్ట్ చేసి నా ఆలోచనలు, అభిప్రాయాలూ, కబుర్లు, ఇంకా పాండు యొక్క సింగినాదం, జీలకర్ర గురించి పొందుపరచవచ్చు అని... అంతే బ్లాగ్ ఓపెన్ చేయటం, స్టార్ట్ చేయటం జరిగింది.
                 పేరుకి మాత్రమె ఈ బ్లాగ్ అనుదీప్ దండి, కాని సింహబాగం మన పాండు కబుర్ల గురించే. అసలు ఆధిపత్యమే వాడిది, ఈ బ్లాగ్ మీద. ఈ బ్లాగ్ స్టార్ట్ చేసిందీ కూడా వాడి గురించే. నాకు, పాండు కి ఉన్న సంభంధం ఏమిటో ముందు ముందు మీకే తెలుస్తుంది.

                 మన పాండు మహా ప్రతిభావంతుడు. అవిక్రపరాక్రమ, గండబేరుండ అని పేరుకి ముందల తగిలించాం.. ఇదీ... వాడిని కా...స్త హైలైట్ చేయాలని నా ప్రయత్నం. అందుకే ఈ బిరుదులూ... మన వాడి పేరు కి తగ్గట్టే ఒక లైన్ కూడా ఉంది.
                       " ఎవడు కొట్టినా... దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పాండు గాడు."

 ఇప్పుడు అర్ధం ఐందా? మనోడు ఎందుకు అవిక్రమపరాక్రముడో..... గండబేరుండ గురించి త్వరలోనే తెలుస్తుంది.....

సరే..!! మన పాండు గురించి కాస్త తెలుసుకుందామా..?

                  " క్రీ.శ.1984 జూలై 17 ....... ఆ రోజు వాతావరణం లో పెను మార్పులు ఏమి చోటు చేసుకోలేదు. అంత నార్మల్ నే. ఏమి expect చేయకండి,  ప్రపంచం లో ఏదో వింత చోటు చేసుకుంటుంది అని. చాల సాదాసీదా గా మనోడు పుట్టేసాడు. ఎందుకంటే  మనోడు ఏమి కారణ జన్ముడు కాదు కదా..!! అందుకే...!. పాపం వాళ్ళ నాన్నకి అమ్మాయలు ఆంటే ఇష్టం. ఆడ పిల్ల పుడుతుంది అనుకుంటే, వీడు ఊడి పడ్డాడు.  వీడు పుట్టటానికి ముందు వీళ్ళ నాన్న రంగారావు గారికి హీరో శోభన్ బాబు మాదిరి హెయిర్ స్టైల్ ఉండేది. వీడు పుట్టినప్పుడు స్టార్ట్ ఐన జుట్టు ఊడటం వీడికి జాబు వచ్చే టైం కి ఆగిపోయంది. ఎందుకంటే అక్కడ ఏమి మిగల్లేదు ఊడిపోటానికి, అంతా ప్లే గ్రౌండ్ ఐపోయింది.   వీడికి చాల సీన్ ఉంది అనుకునేరు... అంత సీన్ ఏమి లేదు కాని కొంచెం &^%$#@! ఉంది. కాని మీరు చాలా సీన్ ఉంది అని అనుకోవాలి... లేకపోతే మీరు శనగ పప్పు లో కాలు ఎలా వేస్తారు చెప్పండి....

                     మనోడికి చిన్నప్పుడు మామూలు తెలివి కాదు ఉంది , అచ్చ ఉరవ తెలివి... దాని వల్ల బాల మేధావి అయ్యాడు... అది ఎలాగో ఒక రెండు చిన్న ఇన్సిడెంట్స్ లో వివరిస్తాను మీకు...

మొదటిది : మనోడికి కొంచెం ఊహ వచ్చాక సినిమా కి వెళ్ళాడు రంగారావు గారితో.. ఎం సినిమా అనుకున్నారు?... అదే.. మన సుప్రీం హీరో చిరంజీవి నటించిన "కొదమసింహం". అంతకు ముందు కూడా వెళ్ళాడు కాని, గుర్తు లేవు ఆ సినిమాలు... ఇది మాత్రమే వాడి మొదటి సినిమాగా గుర్తు ఉంది. ఈ దొరకి, అలా తెర మీద చిరంజీవిని ఇంకా గుర్రంని చూసేసరికి  ఆగలేదు... 35MM స్క్రీన్ మీద అంతా పెద్ద గా కనిపిస్తుంటే .. వీడు కూడా గుర్రం కావాలని ఒకటే నస. అది కాస్త కాసేపటికి గొడవగా మార్పు చెందింది. రంగారావు గారేమో "ఒరేయ్ నాన్న..!! అది సినిమారా....  గుర్రం ఇప్పుడు ఎక్కడ నుంచి వస్తుంది"  అని చెపుతుంటే వినడే మాట... ఇంగ ఆయనకి చిర్రెతుకొచ్చి రెండు పీకాడు... అంతే... ఇంగ ప్రవాహం స్టార్ట్.... గంగ అండ్ యమునా ఫ్రం  ముక్కు, కృష్ణ అండ్ గోదావరి ఫ్రం కళ్ళు.... ఏడుస్తూనే ఉన్నాడు... పాపం...ఇంతలో ఇంటర్వల్ కార్డు పడ్డది... లైట్స్ వెలిగాయి. వీడి ఏడుపు ఆగిపోయింది, ఎవరినో చూస్తూ.. ఎలాగంటారా..? మనోడి పక్కనే బేబీ Angel లాగా ఉన్న పాప GOLDSPOT తాగుతుంది .. అది వీడు లైట్స్ వెలగంగానే చూసాడు లెండి. అంతే వాళ్ళ నాన్న కొట్టిన విషయం మర్చిపోయి బేబీ ANGEL అండ్ తను తాగే GOLDSPOT మీద కన్ను పడ్డది... ANGEL ఎలాగో దక్కదు కాబట్టి GOLDSPOT దొరకచ్చు అని టక్కున వాళ్ళ నాన్నకెల్లి చూసాడు ఆశగా... కాని రంగారావు గారు మాత్రం ఇంటర్వల్ టైం లో స్క్రీన్ మీద వచ్చే నగరం లో నేటి సినిమాలు క్లిప్పింగ్స్ వైపు చూస్తున్నారు చాలా సీరియస్ గా..... నాన్న అని పిలిచాడు, లాభం లేదు.. ఈ సారి కేక వేశాడు.... ఐన ఏమి లాభం లేదు... అసలు రంగారావు గారు వీడిని పట్టించుకోవటం లేదు.... సో ఇందాక గొడవ చేసినందుకు GOLDSPOT బొక్క అనమాట....


                సరే అనుకొని బరువైన మనసుతో... మిగత సినిమా చూస్తున్నాడు... కాసేపటి తర్వాత మర్చిపోయాడు GOLDSPOT గురించి.. మళ్లీ సినిమాలో లీనం అయిపోయాడు ఎదావిదిగా... ఇప్పుడు మొఖం లో ఒక ఆనందం... ఏదో బుర్ర లో వెలిగింది... అది ఏంటంటే..!! " తెర వెనకాల చిరంజీవి, ఆయన గుర్రం అండ్ మిగత నటులు అంతా ఉంటారు... అక్కడ ఉండే ఇది అంతా చేస్తున్నారు, అందుకే మనం చూడగలుగుతున్నాం అని....." అనిపించిందే తడవుగా రంగారావు గారికి చెప్పాడు... రంగారావు గారు ఒక నవ్వు నవ్వి .. లేదు నాన్న తెర వెనకాల ఎవరు ఉండరు అని చెప్పారు.. వీడు వినడు కదా...!!!!!!!!! మనోడికి అసలే బుర్ర లో  &^%$#@! ఎక్కువనాయే.... గొడవ కాస్త పెద్దది చేసాడు... ఇంగ వేరే దారి లేక సినిమా అయ్యాక చూద్దాం లే... వాళ్ళు అప్పుడు కూడా అక్కడే ఉంటారు, చిరంజీవిని, ఆయన గుర్రం ని కూడా కలిపిస్తాను అని అన్నారు... వీడికి ఇంకా వెలుగు ఎక్కువ అయింది.. ఏదో సాధించాబోతున్నాం అన్న ఫీలింగ్.. సినిమా లో హీరో ప్రతీకారం తో విలన్ ని చంపాలి అనుకోవటం, హీరో తండ్రి బాబు.... వద్దు....!! వాడి పాపానికి వాడిని  చట్టానికి అప్పజెప్పాలి అనే డైలాగ్.... CLIMAX లో శరీఫ్ఫ్ లు రావటం, తీసుకుపోవటం, END టైటిల్స్ తో సినిమా THE END అయింది.  అయతే మనోడి గొడవ మళ్లీ START అయింది... కాని మనోడి గొడవ కి break పడిపోయిన్దండి... అంటే కొంచం కర్చు పెట్టారు రంగారావు గారు... ఆ కర్చు ప్రతిరూపమే GOLDSPOT ... సో మిస్ అయిన GOLDSPOT మళ్లీ చేతికి వచిన్దందోయ్.... చూసారు కదా మనోడి ఉరవ తెలివి తేటలు.. మీ కోసం  కొదమసింహం సినిమాది చిన్న వీడియో జత చేస్తున్నాను చుడండి...





రెండవది: పాండు చిన్నతనంలో దోమల కోసం కొత్తగా ఆల్అవుట్ మెషిన్ వచ్చింది... TV లో విస్తృతంగా ప్రచారం కూడా చేసారు... అప్పట్లో వచ్చిన trailor ని మీరు గమనిస్తే ఆల్అవుట్ మెషిన్ కప్ప లాగా ఎగిరి దోమలని తింటుంది... అది చుసిన వీడి మొఖం లో మళ్లీ అదో రకం తేజస్సు... మరి కనిపెట్టేసాడు ఏదో వీడు అన్నట్టు... కొన్ని రోజులకి రంగారావు గారు ఇంట్లో దోమలు ఎక్కువ అయ్యాయ్ అని,ఆల్అవుట్ మెషిన్ తీసుకువచ్చారు... ఆ రోజు రాత్రికి పాండు వాళ్ళ అమ్మ(మణి) గారు ఆల్అవుట్ ఆన్ చేసి పడుకున్నారు... వీడు మాత్రం దానికేల్లె చూస్తూ ఉన్నాడు... వాళ్ళ అమ్మ ఏమో వీడు ఏంటి నిదుర పోకుండా దానికేల్లి చుష్టునాడు అని.. ఏంటి నాన్న..? దానికెల్లి తదేకంగా చూస్తున్నావ్ ఆంటే... మనోడి బదులిచ్చాడు ఇలా...

                    " ఏంటి అమ్మా...? ఇందాకటి నుంచి చూస్తున్నాను... ఇది కప్ప లాగా ఎగిరి దోమలని తినటం లేదు ఏంటి...??"

                  ఆ ఇంటెలిజెంట్ question కి వాళ్ళ అమ్మ గారు "హా...!!! " అనే బితరపోయే expression ... తర్వాత విషయం తెలిసి ఒకటే నవ్వులు ఇంట్లో... అలా ఆ రోజు రాత్రి అందరు నవ్వుతు నిదురపోయారు...

మీ కోసం ఆ ఆల్అవుట్ trailor జత చేస్తున్నాను చుడండి...


సరే... दोस्तो, अभ हम चलते हे|  ఇది నా మొదటి టపా అండి... తప్పులు ఉంటే నాకు సూచనలు ఇవ్వగలరని ప్రార్ధన... మళ్లీ ఇంకొక టపా తో కలుస్తాను... అప్పటి దాక బై బై.... చీరియో...


---- అనుదీప్...